శనివారం 24 అక్టోబర్ 2020
Vikarabad - Sep 24, 2020 , 01:22:57

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి

వికారాబాద్‌ రూరల్‌ : సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎస్సీ బిల్లును ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు.  వికారాబాద్‌ జిల్లా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద చేపట్టిన ఒక్కరోజు నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వందరోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటివరకు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టలేదన్నారు. కాలయాపన చేయకుండా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షుడు రాజు, రాష్ట్ర నాయకులు ఆనంద్‌, రామకృష్ణ, అంజిబాబు, తిమ్మని శంకర్‌ పాల్గొన్నారు. logo