మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Sep 21, 2020 , 01:00:50

ఆహ్లాదానికి చిహ్నాలు.. ప్రకృతి వనాలు

ఆహ్లాదానికి చిహ్నాలు.. ప్రకృతి వనాలు

24 గ్రామ పంచాయతీల్లో  జోరుగా పనులు

పర్యవేక్షిస్తున్న అధికారులు

కడ్తాల్‌: పల్లెల్లో మరింత పచ్చదనాన్ని పెంచేలా, ప్రజలకు ఆరోగ్య, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం  ‘పల్లె ప్రకృతి వనాల’ను ఏర్పాటు చేస్తుంది. ప్రతి గ్రామంలో ఎకరం ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి వీటిని ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌శాఖల అనుసంధానంతో ఏర్పాటు చేస్తున్న పల్లె ప్రకృతి వనాలతో  గ్రామాలు కొత్తశోభను సంతరించుకోనున్నాయి. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో అధికారులు ఆ యా గ్రామాల్లో ప్రభుత్వ భూమిని ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలకుగానూ అన్ని జీపీల్లో ప్రకృతి వనాల పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 13 గ్రామ పంచాయతీల్లోని పల్లె ప్రకృతి వనాల్లో నాలుగు వేల చొప్పున 52 వేల మొక్కలను నాటి, వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు  చేస్తున్న పల్లె ప్రకృతి వనాల పనులను ఎంపీడీవో, ఈజీఎస్‌ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.  పార్కుల్లోని మొక్కలను సంరక్షించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు వాటర్‌ ట్యాంకర్లతో నీళ్లు పోయిస్తున్నారు.

నాలుగు వేల మొక్కలు నాటాం..

విలేజ్‌ పార్కులో నాలుగు వేల మొ క్కలు నాటాం. గ్రామ ప్రజలకు ఉద యం, సాయంత్రం వేళల్లో నడకకు వా కింగ్‌ ట్రాక్‌ ఉపయోగపడుతుంది. ప్రజ ల  మేలుకోరి వారి అవసరాల కోసం ఎలాంటి కార్యక్రమమైన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది.

- లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

అందరికీ అందుబాటులో...

మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూమిని గుర్తించి, పల్లె ప్రకృతి వనాల పనులను ప్రారంభించాం. గ్రామ స్థాయిని బట్టి ముప్పావు ఎకరం నుంచి ఎకరంన్నర వరకు  విలేజ్‌ పార్కుల పనులు వేగంగా జరుగుతున్నాయి.            

- అనురాధ, ఎంపీడీవో, కడ్తాల్‌ మండలం


logo