మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Sep 21, 2020 , 01:00:46

ఆదివారం.. ఆనందంగా..

ఆదివారం.. ఆనందంగా..

 అనంతగిరి పద్మనాభుడిని దర్శించుకున్న భక్తులు

కోట్‌పల్లి ప్రాజెక్టుకు భారీగా పర్యాటకుల రాక

వికారాబాద్‌ రూరల్‌: అనంతగిరి శ్రీ అనంతపద్మనాభ స్వామిని ఆదివా రం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆల య పరిసరాల్లో కాసేపు సేదతీరారు. ఆలయ సిబ్బంది భక్తులను కరోనా నిబంధనలు పాటిస్తూ లోపలికి అనుమతించారు. చిన్న పిల్లలను అనుమతించలేదు. స్వామివారిని దర్శించుకొని అనంతరం నందిఘాట్‌ సమీపంలో ట్రక్కింగ్‌ చేస్తూ అడవి ప్రాంతంలో రోజంతా ఉల్లాసంగా గడిపా రు. కొందరు పర్యాటకులు పెంపుడు జంతువులను వెంట తీసుకొచ్చారు. 

కోట్‌పల్లి ప్రాజెక్టులో పర్యటకుల సందడి

ధారూరు: మండలంలోని కోట్‌పల్లి ప్రాజెక్టుకు వరుస సెలవులు కావడంతో భారీగా పర్యటకులు చేరుకున్నారు. అదివారం సెలవు దినం కావడంతో  మండల పరిధిలోని గ్రామాల పర్యటకులే కాక చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రాజెక్టుకు చేరుకున్నారు. జిల్లాలోనే అతి పెద్దదైన కోట్‌పల్లి ప్రాజెక్టుకు రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ నగరాల నుంచి భారీగా రావడంతో కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో  పర్యటకుల తాకిడి ఎక్కువైంది. యువత , చిన్నారులు,మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసి అడుతూ పాడుతూ ఆనందంగా గడిపారు.

logo