ఆదివారం 25 అక్టోబర్ 2020
Vikarabad - Sep 06, 2020 , 00:40:52

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు

ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే కఠిన చర్యలు

వ్యక్తులను గుర్తించి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని 

సర్పంచ్‌, కార్యదర్శులకు ఆదేశం

పెద్దేముల్‌, ఇందూరు గ్రామాల్లో ధ్వంసం చేసిన కంపోస్టు షెడ్డులను 

పరిశీలించిన అడిషనల్‌ డీఆర్డీవో స్టీవెన్‌నిల్‌, డీఎల్పీవో చంద్రశేఖర్‌

పెద్దేముల్‌ : ప్రభుత్వ ఆస్తులను ఎవరైనా ధ్వంసం చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్‌ డీఆర్డీవో స్టీవెన్‌నిల్‌, డీఎల్పీవో చంద్రశేఖర్‌ హెచ్చరించారు. శనివారం మండలంలోని పెద్దేముల్‌ పంచాయతీ అనుబంధ గ్రామం పెద్దేముల్‌ తండాలో నిర్మాణంలో ఉన్న కంపోస్టు షెడ్డును, ఇందూరు గ్రామంలోని పల్లె ప్రకృతి వనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు వాటిని సందర్శించి, సంబంధిత వ్యక్తులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సర్పంచ్‌, కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్‌ డీఆర్డీవో స్టీవెన్‌నిల్‌, డీఎల్పీవో చంద్రశేఖర్‌ ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులు కేటాయించిన ప్రభుత్వ భూముల్లో కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు నిర్మిస్తే ధ్వంసం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. సదరు వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయించి, ధ్వంసమైన ప్రభుత్వ ఆస్తులకు పెట్టిన ఖర్చులు కూడా రికవరీ చేయించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్మాణాల పట్ల అభ్యంతరాలుంటే సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని, తప్పా ఇలా ధ్వంసం చేయరాదని హెచ్చరించారు. అంతకుముందు ధ్వంసం జరిగిన కంపోస్టు షెడ్లు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. వారి వెంట పెద్దేముల్‌, ఇందూరు గ్రామాల సర్పంచ్‌లు ద్యావరి విజయమ్మ, పద్మ, పంచాయతీ కార్యదర్శులు సుధారాణి, రమణ, పెద్దేముల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బల్వంత్‌రెడ్డి, ఎంపీవో సుష్మా, ఏపీవో నర్సింహులు, ఈసీ కృష్ణ, నాయకులు పాల్గొన్నారు. logo