గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 15, 2020 , 00:36:51

ఆత్మగౌరవాన్ని పెంచే షీ టాయిలెట్లు

ఆత్మగౌరవాన్ని పెంచే షీ టాయిలెట్లు

బాలింతలకు ప్రత్యేక గది 

నిరుపేద కుటుంబానికి ఉపాధి

తెలంగాణ సర్కార్‌కు ప్రజల కృతజ్ఞతలు

తాండూరు: తెలంగాణ సర్కార్‌ ఇచ్చిన హామీ మేరకు తాండూరు మున్సిపల్‌ పరిధిలో నాలుగు చోట్ల షీ టాయిలెట్లను ఆకర్షణీయంగా నిర్మించారు. నియోజకవర్గంలోని యా లాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాల్లోని వేలాది సంఖ్యలో ప్రజలు నిత్యం తాండూరుకు రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో పట్టణంలో ఎక్కడా షీ టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడేవారు. ఈ విషయం గమనించిన మహిళా ప్రజాప్రతినిధులు పట్టణ ప్రణాళికలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం పట్టణంలో షీ టాయిలెట్లను నిర్మించేందుకు దృష్టి సారించింది. ముందుగా జూలై మాసంలో నాలుగు చోట్ల వీటికి శ్రీకారం కారం చుట్టింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ప్రత్యేక శ్రద్ధతో నిత్యం పరిశీలిస్తూ వేగంగా షీ టాయిలెట్లు నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా చూపరులను ఆకట్టుకునేలా  ఆకర్షణీయంగా నిర్మించిన షీ టాయిలెట్లను నిర్మించారు. ఇటీవల ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి స్థానిక నేతలతో కలిసి వీటిని ప్రారంభించారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ తెలంగాణ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

బాలింతలకు ప్రత్యేక గది..

విస్తరిస్తున్న తాండూరు జనాభాతో పాటు పట్టణానికి వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు చోట్ల నిర్మించిన షీ టాయిలెట్ల సమీపంలోనే మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న ప్రత్యేక ఆలోచనతో బాలింతలు పసిపాపలకు పాలు ఇచ్చేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటుచేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు తాండూరులో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన షీ టాయిలెట్లలో మూత్రశాలలు, మరుగుదొడ్డితో పాటు బాలింతల ఇబ్బందులను దూరం చేస్తున్నాయి. దీంతో పాటు జనరల్‌ స్టోర్‌ను కూడా నిర్మించి ఒక కుటుంబానికి ఉపాధి పొందేందుకు తోడ్పాటునందిస్తున్నారు. 


ఉపాధి కల్పించడం అభినందనీయం

ఏండ్ల నుంచి మా వాల్మీకి మే తర్‌ ప్రగతి సమాజం పేదలు స్వ యం ఉపాధికి నోచుకోక ఎన్నో అ వస్థలు పడుతున్నాం. ప్రభుత్వ ఆదేశాలతో షీ టాయిలెట్ల ద్వా రా మాలాంటి నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించడం అభినందనీయం. షీటాయిలెట్ల నిర్వహణతో  కల్పిస్తున్న ఉపాధి వల్ల  జీవితాలు మెరుగుపడాతాయి. ఆర్థిక ఇబ్బందులు కాస్త దూరమైనట్లే.

- శ్యామ్‌లాల్‌, వాల్మీకి మేతర్‌ ప్రగతి సమాజం

మహిళల ఆత్మగౌరవం కోసం

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో తాండూరు మున్సిపాలిటీలో షీ టాయిలెట్ల నిర్మాణాలు ప్రారంభించాం. దీం తో మహిళలకు ఇబ్బందులు తొలగిపో యి ఆత్మగౌరవం పెంపొందుతుంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పట్టణ ప్రగతి ద్వారా మహిళల కోసం షీ టాయిలెట్లు ఆకర్షణీయంగా నిర్మించడం చాలా సంతోషం. అందుకు తెలంగాణ సర్కార్‌కు మహిళలందరి తరుఫున ధన్యవాదాలు. 

- స్వప్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌


logo