e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home వికారాబాద్ సిర్గాపూర్‌-మాసాన్‌పల్లి రోడ్డును డబుల్‌ లేన్‌గా విస్తరించండి

సిర్గాపూర్‌-మాసాన్‌పల్లి రోడ్డును డబుల్‌ లేన్‌గా విస్తరించండి

సిర్గాపూర్‌-మాసాన్‌పల్లి రోడ్డును డబుల్‌ లేన్‌గా విస్తరించండి

మంత్రి ప్రశాంత్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నారాయణఖేడ్‌, మార్చి 29: మండల కేంద్రమైన సిర్గాపూర్‌ నుంచి కల్హేర్‌ మండలం మాసాన్‌పల్లి వరకు ఉన్న రోడ్డును విస్తరిం చి డబుల్‌ లేన్‌ రోడ్డుగా అభివృద్ధి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మండల కేంద్రమైన కల్హేర్‌ మీదుగా ఉన్న ఈ రోడ్డు ప్రస్తుతం సింగిల్‌ లేన్‌ గా ఉండడం మూలంగా వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని మంత్రికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సదరు రోడ్డు కామారెడ్డి జిల్లాకు అనుసంధానం గా ఉందని, ఈ రోడ్డును అభివృద్ధి చేయడం అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి సానుకూలంగా స్పందిస్తూ డబుల్‌ లేన్‌ రోడ్డు విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
నారాయణఖేడ్‌ మండలం సంజీవన్‌రావుపేట్‌ ఉపసర్పంచ్‌ విఠల్‌రెడ్డి ఇటీవల మృతి చెం దడంతో సోమవారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆయన కుటుంబసభ్యులను కలుసుకుని పరామర్శించారు. విఠల్‌రెడ్డి మృతికి గల కారణాల ను తెలుసుకున్న ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించిన పక్షం లో అవసరమైన సహకారం అందిస్తానని వారికి భరోసానిచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిర్గాపూర్‌-మాసాన్‌పల్లి రోడ్డును డబుల్‌ లేన్‌గా విస్తరించండి

ట్రెండింగ్‌

Advertisement