గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 24, 2020 , 01:26:49

కల్వర్టు మంజూరు చేయాలని వినతి

కల్వర్టు మంజూరు చేయాలని వినతి

మర్పల్లి : మండలంలోని షాపూర్‌తండాలోని కారిగుళ్లవాగుకు కల్వర్టు మంజూరు చేయాలని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌కు మండల నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల క్రితం తండాకు చెందిన పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తుండగా వాగులో కొట్టుకుపోయి మృతి చెందిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాగుపై కల్వర్టు నిర్మించాలని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. వినతిపత్రం సమర్పించినవారిలో టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి మధుకర్‌, సర్పంచులు శివకుమార్‌, జైపాల్‌రెడ్డి, పీర్యానాయక్‌ పాల్గొన్నారు.


logo