గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 08, 2020 , 00:53:49

రికార్డులు అప్పగించిన వీఆర్వోలు

రికార్డులు అప్పగించిన వీఆర్వోలు

పరిగి : పరిగి మండల పరిధిలోని 37 రెవెన్యూ గ్రామాలకు చెందిన అన్ని రికార్డులను గ్రామ రెవెన్యూ అధికారులు నమోదు చేసి సోమవారం తాసిల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డికి అందజేశారు. అన్ని గ్రామాల రికార్డులను వీఆర్వోలు అందజేశారని తాసిల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి తెలిపారు. 

కులకచర్లలో..

కులకచర్ల: వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు  సోమవారం 23గ్రామాలకు  సంబంధించిన రెవెన్యూ రికార్డులను వీర్వోలు తాసిల్దార్‌ అశోక్‌కుమార్‌కు అందజేశారు.  కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్‌ శ్రీనివాస్‌రావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

బషీరాబాద్‌లో...

బషీరాబాద్‌: బషీరాబాద్‌ మండలంలో  32 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందుకు సంబంధించిన రికార్డులను వీఆర్వోలు  తాసిల్దార్‌ షౌకత్‌అలీకి అప్పగించారు.   ఆయన నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించారు. 

 దోమ మండలంలో... 

దోమ: ప్రభుత్వ ఆదేశాల మేరకు వీఆర్వోల నుంచి రెవె న్యూ రికార్డులను స్వాధీనం చేసుకున్నామని తాసిల్దార్‌ శైలేంద్రకుమార్‌ తెలిపారు. వీఆర్వోల నుంచి స్వాధీనం చేసుకున్న రికార్డుల వివరాలను కలెక్టర్‌ కార్యాలయానికి సమగ్ర నివేదికతో అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు జహంగీర్‌, పెద్ద రాజు, చిన్న రాజు తదితరులు పాల్గొన్నారు.


logo