బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Sep 17, 2020 , 01:46:34

రేడియల్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలి

రేడియల్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలి

- అసెంబ్లీలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య  

షాబాద్‌: చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రధా న రోడ్ల విస్తరణ చేపట్టాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సీఎం కేసీఆర్‌ను కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల సంద ర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిశారు. నియో జకవర్గంలోని షాబాద్‌, చేవెళ్ల, శంక ర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబుపేట్‌ మండలా లకు సంబంధించిన ప్రధాన రోడ్ల విస్తరణ గురించి వివరించారు. వెలిమెల నుంచి పొద్దటూర్‌ వరకు రేడియల్‌ రోడ్డు నిర్మిం చాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. పటాన్‌చెరువు రింగ్‌రోడ్డు నుంచి వెలిమెల మీదు గా కొండకల్‌, మోకిలా, టంగటూర్‌ వరకు రేడియల్‌ రోడ్డు పనులు ప్రారంభించి ఏడా ది గడిచినా పూర్తికాలేదన్నారు. మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌ నుంచి చేవెళ్ల మండలం కౌకుంట్ల వరకు తంగెడపల్లి, కొత్తపల్లి, ప్రగతి, మేడిపల్లి గ్రామాల మధ్యలో అసంపూర్తిగా వంతెనల వద్ద రోడ్డు పనులు పెండింగ్‌ ఉండడంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రోడ్డు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.logo