గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 20, 2020 , 01:48:49

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాలి

మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాలి

 వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు 

 వికారాబాద్‌: బ్యాంకు లింకేజీ పనులను అక్టోబర్‌ వరకు పూర్తిచేసి మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు అధికారులకు సూచించారు. శనివారం పట్టణ పరిధిలోని మద్గుల్‌చిట్టెంపల్లి గ్రామంలో గల డీపీఆర్‌సీ భవన్‌లో జిల్లా మహిళా పరస్పర సహాయ స హకార పొదుపు సంఘం నాలుగో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కలెక్టర్‌ పౌసుమిబసు మా ట్లాడుతూ పంటకాలంలో అవసరమైన ఖర్చులకు ప్రతి సం వత్సరం బ్యాంకర్లు జనవరి మాసం నుంచి మార్చి వరకు రుణాలు అందిస్తారని, ఇంతకు ముందు తీసుకున్న రుణాలకు సంబంధించిన కిస్తులు సక్రమంగా చెల్లించి రుణాలు పొందాలని తెలిపారు. జిల్లాలో వ్యవసాయానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున సభ్యులందరూ వ్యవసాయ ఉ త్పత్తులు బాగా పండించి వాణిజ్య పరంగా హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నందున పండించిన పంటలను మార్కెటింగ్‌ చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. 2019-20 సంవత్సరానికి గాను వడ్డిలేనీ రుణాల కోసం రూ. తొమ్మిది కోట్లు మంజూరు చేశామన్నారు. ఇందులో ఇప్పటివరకు 96.81శాతం రుణాలు రికవరీ చేసినట్టు చెప్పారు. జిల్లాలో ని తాండూరు, వికారాబాద్‌ ఏరియా దవాఖానల్లో సదరం క్యాంపులు నిర్వహిస్తామన్నారు. మునుపటి లాగా కాకుం డా మీ సేవాలో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి తెలిపిన తేదీల్లో క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. జిల్లాలోని18 మండలాలలో 13, 647 స్వయం సహాయక సం ఘాలు ఉన్నాయని వీటిలో ఏ,బీ,సీ,డీ,ఈ గ్రేడులుగా వా రి పని సామర్థ్యాన్ని బట్టి వర్గీకరించడం జరిగిందన్నారు. కింది స్థాయిగ్రేడ్లు బాగా పని చేసి ఏ,బీ గ్రేడులలో ఉండాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో కృష్ణన్‌, జిల్లా మ హిళా సమాఖ్య అధ్యక్షురాలు ఇందిర, కార్యదర్శి గౌరమ్మ, కోశాధికారి యశోధ, గ్రూపు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

బారికేడ్లు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయండి

 ధారూరు:  కలెక్టర్‌ పౌసుమి బసు శనివా రం ధారూరు మండలంలోని బాచారం, దో ర్నాల్‌ వాగులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాల కా రణంగా బాచారం గ్రామం వాగు వద్ద ఇనుప రాడ్లతో బా రికేడ్లను ఏర్పాటు చేయాలని, ఫ్లడ్‌లైట్లను, దోర్నాల్‌ వాగు వద్ద కంచె వేసి ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేయాలని అధికారుల కు సూచించారు. అత్యవసర సేవలకు ఇబ్బంది కలుగకుం డా చూడాలన్నారు.ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటుచేసి, ప్రయాణికులకు మరో మా ర్గం ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్‌ సూచించా రు.కార్యక్రమంలో వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ధా రూరు ఆర్‌ఐ చంద్రమోహన్‌,ఎంపీవో శఫీఉల్లా,కార్యదర్శు లు,కారోబార్లు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.

logo