సోమవారం 10 ఆగస్టు 2020
Vikarabad - Jul 29, 2020 , 01:01:23

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేయాలి

వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌

వికారాబాద్‌ రూరల్‌: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ధారూరు నుంచి దోర్నాల్‌ వెళ్లే వంతెన నిర్మాణ పనులు, బాచారం దగ్గర ఉన్న రోడ్డు, బంట్వారం మండలంలోని తొర్మామిడి రోడ్డు, వికారాబాద్‌ నుంచి సిద్దులూరు వెళ్లే బ్రిడ్జి నిర్మాణ పనులు, వికారాబాద్‌ నుంచి మోమిన్‌పేట వెళ్లే కల్వర్టులు, మన్నేగూడ నుంచి తాండూరు వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పనులు ఆగిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఈఈ లాల్‌సింగ్‌, డీఈఈ ప్రభాకర్‌, శ్రీనివాస్‌, ఏఈలు రవికుమార్‌, లక్ష్మీనారాయణ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. 


logo