మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Sep 22, 2020 , 01:10:34

ఇంటింటికీ ఇంకుడు గుంతలు తప్పనిసరి

ఇంటింటికీ ఇంకుడు గుంతలు తప్పనిసరి

 రైతు వేదిక , వైకుంఠధామాల పనుల్లో వేగం పెంచాలి

 పారిశుద్ధ్య రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

 జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు

వికారాబాద్‌ రూరల్‌: వర్షపునీరు వృథాకాకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, ప్రతి ఇంటికీ ఒక ఇంకుడు గుంత నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు సూచించారు. సోమవారం వికారాబాద్‌ మండల పరిధిలోని సర్పన్‌పల్లి, గొట్టిముక్కుల గ్రామాల్లో మండల ప్రత్యేకాధికారి ఆర్డీవో ఉపేందర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మురుగు కాలువలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మురుగు కాలువల్లో చెత్తచెదారం చేరకుండా మోరీలకు జాలీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లోని ప్రజల నుంచి తడి పొడి చెత్త వేరు చేసి సేకరించాలని గ్రామ సర్పంచ్‌కు సూచించారు. వైకుంఠధామాల పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలన్నారు. గొట్టిముక్కులో నిర్మిస్తున్న రైతువేదిక పనుల్లో వేగం పెంచి  వానకాలం పంట చేతికొచ్చే సరికల్లా  సిద్ధం చేయాలన్నారు. అనంతరం సర్పన్‌పల్లి ప్రాజెక్టును సందర్శించి కుడికాలువ తూముపై జాలి ప్రమాదకరంగా ఉందని దాన్ని సరి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. చెరువులోకి ఎవరు రాకుండా బారికేడ్లు ఏర్పా టు చేయాలని, అలుగు సమీపంలో మెట్లభా గం దెబ్బతిన్నందున పనులు చేపట్టాలన్నా రు. ప్రాజెక్టు కింద ఉన్న రైతుల పొలాలకు ఎలాంటి నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.  డీఎల్‌పీవో అనిత, ఎంపీడీవో సుభాషిణి,  సర్పంచ్‌లు వెంకటేశ్వర్లు, షకీరాబేగం, ఏఈలు ఆదిత్య, చాణిక్యరెడ్డి  పాల్గొన్నారు. logo