బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Jun 14, 2020 , 04:26:41

కొడంగల్‌కు మహర్దశ- ఎమ్మెల్యే పట్నం

కొడంగల్‌కు మహర్దశ- ఎమ్మెల్యే పట్నం

కొడంగల్‌: నియోజకవర్గ అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కొడంగల్‌కు మహర్దశ పట్టనున్నదని ఎమ్మెల్యే పట్న నరేందర్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణ శివారులోని పాలమూరు రోడ్డు నుంచి టీటీడీ కల్యాణ మండపం వరకు సైడ్‌ డ్రైన్స్‌తోపాటు సీసీ రోడ్డు నిర్మించేందుకు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం పేదలకు కూరగాయలు పంపిణీచేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా మంత్రి కేటీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారన్నారు. మంజూరైన పనులు పూర్తి చేయడంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు హామీ ఇచ్చారన్నారు. మూడు నెలల్లో పనులు పూర్తిచేసి, సెప్టెంబర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటనలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కొత్త మున్సిపాలిటీ భవనం, పాత ఇరిగేషన్‌ కార్యాలయ స్థలంలో కొత్త భవన నిర్మాణానికి అనుమతులు లభించాయన్నారు. పట్టణ శివారు మహబూబ్‌నగర్‌ నుంచి గౌరారం రోడ్డు టీటీడీ కల్యాణ మండపం వరకు సైడ్‌డ్రైన్స్‌తో పాటు సీసీ డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఈఈ ప్రభాకర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్‌ముఖ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, మాజీ జడ్పీటీసీ ఏన్గుల భాస్కర్‌, కో ఆప్షన్‌ సభ్యుడు ముక్తార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంరెడ్డి, బొంరాస్‌పేట పీఏసీఎస్‌ అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు ఫకీరప్ప, కమ్లీబాయి పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

వికారాబాద్‌: తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను వికారాబాద్‌, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేశ్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. జిల్లాలోని నియోజక వర్గాల రాజకీయాలు, అభివృద్ధి, పలు విషయాలపై మంత్రి కేటీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు వారు తెలిపారు.


logo