మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Sep 09, 2020 , 01:00:20

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే  సాయం

నందిగామ: నందిగామ గ్రామానికి చెందిన వేణుగోపాల్‌  వెన్నుపూస సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ దవాఖానలో ఆపరేషన్‌ చేయించుకున్నాడు. విష యం తెలుసుకున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మంగ ళవారం వేణుగోపాల్‌ ఇంటికి చేరుకుని ఆరోగ్య పరిస్థి తిని అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్ధిక పరిస్థితి బాగ లేకపోవడంతో రూ.50,000 చెక్కును వేణుగోపాల్‌ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అంద జేశారు. సీఎం రీలిఫ్‌ఫండ్‌ ద్వారా కూడా వైద్య ఖర్చులు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్‌గౌడ్‌, చేగూ రు పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ఉపసర్పంచ్‌ కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.
logo