శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Jun 22, 2020 , 23:51:03

కొడంగల్‌ నియోజకవర్గంలో నేడు మంత్రుల పర్యటన

కొడంగల్‌ నియోజకవర్గంలో నేడు మంత్రుల పర్యటన

బొంరాస్‌పేట: కొడంగల్‌ నియోజకవర్గంలో గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మంగళవారం పర్యటించనున్నట్లు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కోట్ల యాదగిరి, వైస్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, దేశ్యానాయక్‌తో కలిసి వారు మంత్రుల పర్యటన వివరాలను వెల్లడించారు. మెట్లకుంటలో బుర్రితండా నుంచి గ్రామానికి నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించి, రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. సూర్యానాయక్‌తండా బీటీ రోడ్డును ప్రారంభించి సమావేశంలో పాల్గొంటారని, సాలిండాపూర్‌ బీటీ రోడ్డు ప్రారంభం, దుప్‌చెర్ల బీటీ రోడ్డు ప్రారంభం, తుంకిమెట్లలో కాకరవాణి వాగుపై నిర్మించే రెండు చెక్‌డ్యాంల నిర్మాణానికి శంకుస్థాపన, కొడంగల్‌ మండలం పోచమ్మతండాకు నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభిస్తారన్నారు. 


logo