గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 05, 2020 , 01:18:46

మన్‌సాన్‌పల్లి డైవర్షన్‌ రోడ్డు పునరుద్ధరణ

మన్‌సాన్‌పల్లి డైవర్షన్‌ రోడ్డు పునరుద్ధరణ

పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి

 పెద్దేముల్‌: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కూలి మరమ్మ తు పనులు పూర్తై  వాహనాల రాకపోకలు పునరుద్ధరించిన మన్‌సాన్‌పల్లి బ్రిడ్జి డైవర్షన్‌ రోడ్డును ఎమ్మెల్సీ పట్నం మ హేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిలు శుక్రవారం పరిశీలించారు. మండల పరిధిలోని తాండూరు నుంచి హైదరాబాద్‌ ప్రధాన రహదారి మార్గంలో గల మన్‌సాన్‌పల్లి నూతన బ్రిడ్జి నిర్మాణం కొరకు వేసిన డైవర్షన్‌ రోడ్డు ఇటీవల కురిసి న భారీ వర్షాలకు పూర్తిగా కూలి ప్రధాన రోడ్డు పూర్తిగా తెగిపోయి ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగి రవా ణా వ్యవస్థ స్తంభించింది. అప్పట్లో డైవర్షన్‌ రోడ్డును విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసులు పరిశీలించి వీలైనంత త్వరగా డైవర్షన్‌ రోడ్డుకు మరమ్మతులు చేప ట్టి అందుబాటులోకి తీసుకురావాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. వెంటనే పనులు ప్రారంభించిన అధికారులు డైవర్షన్‌ రోడ్డును అందుబాటులోకి తీసుకు రాగా శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎ మ్మెల్యే రోహిత్‌ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వా రు ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతూ తాండూరు నుంచి హైదరాబాద్‌ ప్రధాన రహదారి అప్రోచ్‌ రోడ్డును వీలైనంత త్వరగా బాగు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని, అదే విధంగా నూతన బ్రిడ్జి పనులను కూడా త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డును పరిశీలించిన సమయంలో ఆర్‌అండ్‌బీ డీ ఈ శ్రీనివాస్‌, పెద్దేముల్‌ ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌ రె డ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు డడీవై నర్సింహులు, కిషన్‌ రావు, రంగయ్య, అబ్దుల్‌ రవూఫ్‌, రాజు గౌడ్‌, జావెద్‌, బోయ రా జు, హరిహర గౌడ్‌, బాల్‌రెడ్డి, పట్లోళ్ళ నర్సింహులు, రఘు,  సర్పంచులు బల్వంత్‌ రెడ్డి, చంద్రయ్య, సంతోష్‌, గోవర్ధన్‌ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 


logo