బుధవారం 21 అక్టోబర్ 2020
Vikarabad - Sep 08, 2020 , 00:53:45

ప్రగతి పథంలో మాదిరెడ్డిపల్లి

ప్రగతి పథంలో మాదిరెడ్డిపల్లి

 పల్లె ప్రగతిని సాధించిన వైనం 

 ఆదర్శ గ్రామంగా ఎదుగుదల

 వందశాతం ఇంటి పన్ను వసూలు

 అధికంగా ఉపాధి హామీ పనులు

 సర్పంచ్‌ను అభినందించిన కలెక్టర్‌ పౌసుమిబసు

నవాబుపేట: మండల పరిధిలోని మాదిరెడ్డిపల్లి  గ్రామం ప్రభు త్వం ఆశించినట్లుగా పల్లె ప్రగతిని సాధించి ఆదర్శంగా నిలిచిం ది.  జిల్లా కలెక్టరు పౌసుమిబసు గ్రామాన్ని స్వయంగా సందర్శించి పల్లె ప్రగతి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించారని  సర్పంచ్‌ తలారి యశోదను కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. సందర్శకుల రిజిస్టరులో ఆదర్శ గ్రామమని లిఖితపూర్వకంగా ఆమె కామెంట్‌ చేశారు. గ్రామంలో ప్రకృతి వనం మొదలు కొని హరితహారం, పారిశుద్ధ్యం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు నిర్మాణం, కంపోస్టుషెడ్డు నిర్మాణాలను మలి విడతలో అన్ని గ్రామాల కంటే ముందు నిర్మాణాలు చేసి ఆదర్శంగా నిలిచారు.  పారిశుద్ధ్యంపై కూడా గ్రామ పంచాయతీ ఎనలేని కృషి చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచింది. పాతబడిన 

ఒకప్పటి పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించి అందమైన ఆరోగ్య ఉప కేంద్రంగా మలిచారు. గ్రామంలో సేదతీరడానికి బల్లలు ఏర్పాటు చేశారు. బస్టాండు వద్ద ఉన్న మర్రి చెట్టుకు అరుగు కట్టి ప్రయాణికులు సేదతీరడానికి అనుకూలంగా మలిచారు. ప్రయాణికులు నిరీక్షించడానికి పరిసరాల్లో బల్లలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటికి రంగులు చేసి కళాత్మకంగా తీర్చి దిద్దారు. అన్ని గ్రామాల కంటే ముందే ప్రకృతి వననాన్ని ఏర్పాటు చేసి అధికారుల అభినందనలను అందుకున్నారు. వైకుంఠధామాల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో ముందుగా ఈ గ్రామంలోనే నిర్మాణం పూర్తి చేయించి ప్రథమ స్థానంలో నిలిచారు. అంతేకాకుండా వంద శాతం ఇంటి పన్నులను వసూలు చేసి మండలంలోనే ప్రథమ స్థానంలో గ్రామాన్ని నిలిపారు. ఉపాధి హామీ పనుల్లో సైతం అధికంగా పనులు నిర్వహించిన గ్రామంగా కూడా గుర్తింపును సొంతం చేసుకున్నది.  


logo