బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Sep 09, 2020 , 01:00:28

టీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని కులాలకు న్యాయం

టీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని కులాలకు న్యాయం

పలుచోట్ల సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన కులసంఘాలు

 టీఆర్‌ఎస్‌ హయాంలోనే తమ కల సాకారమైందన్న నాయకులు

కొడంగల్‌ : కమ్మరులను బీసీ-ఏలో చేరుస్తున్నట్లుగా అసెంబ్లీలో ఆమోదం లభించడంతో కమ్మరి  సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని అంబేద్కర్‌ కూడలిలో టీఆర్‌ఎస్‌, కమ్మరి సంఘం నాయకులు కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కమ్మరులకు గుర్తింపు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నప్పటికీ పట్టించుకోలేదని.. సీఎం కేసీఆర్‌ కమ్మరులను గుర్తించి బీసీ ఏలో చేర్చారని  హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శివప్ప, నరోత్తంరెడ్డి, బాల్‌రాజ్‌, లక్ష్మయ్య, శివాజీ, బాబు, కృష్ణ, విజయ్‌, దశరథ్‌, సంజీవ్‌ పాల్గొన్నారు. 

తాండూరులో  సంబురాల హోరు 

తాండూరు టౌన్‌ : సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంగళవారం తాండూరుకు చెందిన బైల్‌ కమ్మర గిసాడి సంఘం నేతలు క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని రాజీవ్‌ గృహకల్ప సమీపంలో సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బైల్‌కమ్మర కులానికి చెందిన వారిని బీసీ-ఏ జాబితాలోకి చేర్చడంతో పాటు 17 కులాలను బీసీ జాబితాలోకి చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంఘం నాయకులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను చేపడుతున్నదన్నారు.  కార్యక్రమంలో సంఘాల నాయకులు అనిల్‌, యువరాజ్‌,శశి పవార్‌, లక్ష్మణ్‌, ప్రహ్లాద్‌, నందు తదితరులు పాల్గొన్నారు.


logo