మంగళవారం 27 అక్టోబర్ 2020
Vikarabad - Sep 20, 2020 , 01:48:56

దంచికొట్టిన వాన

దంచికొట్టిన వాన

పొంగిన వాగులు, ప్రాజెక్టులు

నీట మునిగిన పంటపొలాలు

ఇండ్లలోకి చేరిన నీరు

 తాండూరు : జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో శనివారం తాండూరు నియోజకవర్గంలో వాగులు, చెక్‌డ్యాంలు, చెరువులు, కుంటలు నీళ్లతో పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల పంటపొలాల్లోకి వరదనీరు చేరడంతో పంటలు పూర్తిగా మునిగిపోయాయి. తాండూరు కాగ్నానది ఉప్పొంగడంతో తాండూరు-కొడంగల్‌ రాకపోకలు నిలిచా యి. జుంటుపల్లి ప్రాజెక్టు నిండి అలుగు పారడంతో జలకళ ను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు. రోడ్డుకు సమాంతరంగా కాగ్నానది వరద పారడంతో ప్రయాణికులు ప్రమా దం బారిన పడకుండా పోలీసులు తగుచర్యలు చేపట్టారు. స్థానిక నేతలు, అధికారులు లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ముందెన్నడూ లేనివిధంగా ప్రాజెక్టులు, చెరువులు, వాగుల్లో నీళ్లు నిండి పొర్లడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయదారులు కోరుతున్నారు. 

 పెద్దేముల్‌ : మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. కందనెల్లితండా, గాజీపూర్‌, బుద్దారం, పెద్దేముల్‌, మంబాపూర్‌, జ నగాం, మారేపల్లి, కందనెల్లి, నాగులపల్లి, గోపాల్‌పూర్‌, తిం సాన్‌పల్లి, తట్టేపల్లి, ఇందూరు, అడికిచెర్ల, పాషాపూర్‌, గొట్లపల్లి, హన్మాపూర్‌, గిర్మాపూర్‌ గ్రామాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో చెరువులు, వాగులు, కుంటలు, కాలువల్లో పెద్ద మొత్తంలో వరద నీరు చేరింది. గాజీపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న వాగు వరద నీ టి ఉధృతికి పొంగి పొర్లింది. దీంతో తాండూరు-సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కాగా శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున కురిసిన వానతో వర్షపాతం 38.4 మిల్లిమీటర్లుగా నమోదు అయింది. గ్రామాల్లో వివిధ కాలనీలలో ఉన్న రోడ్లు కురిసిన వర్షంతో చిత్తడిచిత్తడిగా మారిపోయాయి.

ఇండ్లల్లోకి చేరిన వర్షపు నీరు

 పరిగి టౌన్‌ : శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరుతున్న ది. పంటపొలాల్లో నీరు నిలిచింది. నస్కల్‌ గ్రామంలో లో తట్టు ఇండ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. లఖ్నాపూర్‌ ప్రాజెక్టులోకి భారీగా వర్షం నీరు రావడంతో ప్రాజెక్టు అలుగు పారుతున్నది. 


logo