సోమవారం 19 అక్టోబర్ 2020
Vikarabad - Sep 15, 2020 , 00:36:48

రైతువేదికలు త్వరగా పూర్తి చేయాలి

రైతువేదికలు త్వరగా పూర్తి చేయాలి

 వికారాబాద్‌: రైతు వేదిక, వైకుంఠ ధామాల పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసు తెలిపారు. సోమవారం మద్గుల్‌ చిట్టంపల్లి డీపీఆర్‌సీ భవనంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి , వైకుంఠ ధామం, రైతు వేదికల నిర్మాణం అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ రైతు వేదిక, వైకుంఠ ధామాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. తాసిల్దార్లు, ఎంపీడీవోలకు ల్యాండ్‌ పొజిషన్‌ ఇవ్వాలని కోరా రు.ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం ,అటవీ భూ ములను సత్వరమే గుర్తించి పనులు యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయాలని కోరా రు. అధికారులందరూ సమన్వయంతో పనులు పూర్తి చే యాలని సూచించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పు డు పర్యవేక్షించాలని ఆర్డీవోలను ఆదేశించారు.కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు మోతిలాల్‌, చంద్రయ్య, ఆ ర్డీవో ఉపేందర్‌రెడ్డి, తాండూ రు ఆర్డీవో అశోక్‌ కుమార్‌, డీఆర్డీఏ కృష్ణన్‌, డీపీవో రి జ్వాన పాల్గొన్నారు.

అద్దెకు  పనిముట్లు

 మోమిన్‌పేట్‌: అనంతగిరి ఉత్పత్తి కేంద్రంలో రైతు లకు వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్న ట్లు కలెక్టర్‌ పౌసుమిబసు తెలిపారు. మండల కేంద్ర ంలో సెర్ఫ్‌ ఆధ్వర్యంలో వచ్చిన వ్యవసాయ పరిక రాలను కలెక్టర్‌ పరిశీలించి మాట్లాడుతూ రైతులకు అవసరమయ్యే పరికరాలు ట్రాక్టర్‌, నూర్పిడిమిష న్లు, నగల్లు, కల్పీలెటర్లు తదితర పనిముట్లు అం దుబాటులో ఉన్నాయన్నారు. వీటిని రైతులు అద్దెకు తీసుకొని పనులు చేసుకోవాలని సూచించారు. కా ర్యక్రమంలో డీఆర్డీవో పీడీ కృష్ణన్‌, డీపీఎం శ్రీని వాస్‌, ఏపీఎం మునిస్వామి పాల్గొన్నారు.
logo