సోమవారం 19 అక్టోబర్ 2020
Vikarabad - Sep 24, 2020 , 01:22:49

రైతువేదిక భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

 రైతువేదిక భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

వికారాబాద్‌ : రైతు వేదిక భవన నిర్మాణాలను యుద్ధప్రాతిపదిక పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఛీప్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌, రాష్ట్ర పంచాయతీ రాజ్‌ సెక్రటరీ సందీప్‌కుమార్‌ సుల్తానియా, రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణతో కలిసి ఆయన బుధవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అక్రమ లేఅవుట్లను, కట్టడాలను గుర్తించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  ప్రతి రోజు రైస్‌ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐకి పంపిస్తున్న ధాన్యం వివరాలను, బాలెన్స్‌ వివరాలను ఏడు రోజుల్లో తెలియజేయాలని కోరారు. పట్టణ పరిధిలో వీధి వ్యాపారులను గుర్తించి 5 శాతం రుణ మంజూరు సాధించాలని, ఆన్‌లైన్‌ అప్‌లోడ్‌ పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా అర్బన్‌ పార్కులకు స్థలం గుర్తింపు వివరాలను అప్‌లోడ్‌ చేయాలని, ఈ నెల 30లోగా నర్సరీల ఏర్పాటుకు స్థలాల ఎంపిక, నిర్వహణపై పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని కోరారు. పల్లె ప్రగతిలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌ పొందినందున మొక్కల సంరక్షణ, పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. 2021 సంవత్సరంలో మొక్కలు నాటేందుకు కావాల్సిన నర్సరీ మొక్కల వివరాలపై యాక్షన్‌ ప్లాన్‌ తయారుచేయాలని హౌస్‌ హోల్డ్‌, కమ్యూనిటీ, రోడ్‌సైడ్‌ ప్లాంటేషన్లకు కావాల్సిన మొక్కల వివరాలను సిద్ధం చేయాలని తెలిపారు. పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని అధికారులను కోరారు. కలెక్టర్‌ పౌసుమిబసు, సంబంధిత స్థాయి అధికారులు సత్వరమే చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, చంద్రయ్య, వికారాబాద్‌ డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, తాండూరు ఆర్‌డీవో అశోక్‌కుమార్‌, పీడీడీఆర్‌డీవో కృష్ణన్‌, జడ్పీ సీఈవో ఉషా, డీపీవో రిజ్వాన, మున్సిపల్‌ కమిషనర్లు, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.logo