బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Sep 19, 2020 , 00:31:23

మహిళా రైతులకు ప్రోత్సాహం

మహిళా రైతులకు ప్రోత్సాహం

ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి 

రూ.17 లక్షలు విలువ చేసే వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేత

కులకచర్లలో పరికరాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

బొంరాస్‌పేట: మహిళా సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో 24 మహిళా ఉత్పత్తిదారుల సంఘాలకు రూ.17 లక్షల విలువ చేసే స్ప్రేయర్లు, కలుపు తీసే యంత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌ సమయంలో మహిళల జీవనోపాధికి ప్రభుత్వం కొవిడ్‌ రుణాలను అందజేసిందని గుర్తు చేశారు. త్వరలో మహిళలకు పాడి పశువులను కూడా పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆధునిక యంత్ర పరికరాలను పంపిణీ చేస్తున్నామని వీటిని మహిళలతో పాటు గ్రామంలోని మిగతా రైతులు కూడా ఉపయోగించుకుని వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 

శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులు పూర్తి చేయండి

మండలంలో అన్ని గ్రామాల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి వనాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి సర్పంచ్‌లు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయంలో పల్లె ప్రగతి పనులపై సమీక్షించారు. ఏయే గ్రామాల్లో పనులు నిదానంగా జరుగుతున్నాయి, వాటికి గల కారణాలను ఎంపీడీవో, తాసిల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీటీసీలు శ్రావణ్‌గౌడ్‌, వెంకటమ్మ, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బుజ్జమ్మ,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి, టీఆర్‌ఎస్‌ తాలుకా, మండల  యూత్‌ అధ్యక్షుడు నరేష్‌గౌడ్‌, మహేందర్‌, పార్టీ నాయకులు రామకృష్ణ యాదవ్‌, టీటీ రాములు, నెహ్రూ నాయక్‌, ఏపీఎం అంజిలయ్య, ఎంపీడీవో హరినందనరావు, తాసిల్దార్‌ షాహెదాబేగం పాల్గొన్నారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా 

మహిళల ఆదాయాభివృద్ధి 

కులకచర్ల : వ్యవసాయ రంగాన్ని పండుగ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్లలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులకు వ్యవసాయ పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లాభసాటి వ్యవసాయం చేసేందుకు వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతి గ్రామంలో మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు మహిళా రైతు ఉత్పత్తిదారులుగా ఏర్పడి వ్యవసాయంలో మెళకువలు పాటించేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలోని కులకచర్ల, మోమిన్‌పేట్‌ మండలాలను మోడల్‌ మండలాలుగా గుర్తించి మహిళా రైతు సంఘాలకు వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నామన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం సెర్ప్‌ కార్యక్రమాల ద్వారా కృషిచేస్తున్నదని తెలిపారు. కులకచర్ల మండలంలో రూ.25లక్షలతో వ్యవసాయ పరికరాలు మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అందించామన్నారు. మహి ళా రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు తమకు అందించిన వ్యవసాయ పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా చేసి రైతులకు మరింతగా బాసటగా నిలిచేందుకు, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్‌, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ నాగరాజు, వైస్‌ ఎంపీపీ రాజశేఖర్‌గౌడ్‌, డీపీఎం శ్రీనివాస్‌, ఏపీఎం శోభ, సెర్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo