సోమవారం 26 అక్టోబర్ 2020
Vikarabad - Sep 14, 2020 , 00:51:30

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి

పరిగి ఎమ్మెల్యే  మహేశ్‌రెడ్డి

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

రైతుబీమా, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

 దోమ: గ్రామాల సంపూర్ణ అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో  పంచాయితీ నిధులు రూ. ఐదు లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, జడ్పీటీసీ నాగిరెడ్డి, సర్పంచ్‌ శాంతరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో రూ.రెండులక్షల ఎనబై వేలతో ఏర్పాటు చేసిన 22 సీసీ కెమెరాలను ప్రారంభించారు.కార్యక్రమంలో ఎంపీటీసీ నవాజ్‌రెడ్డి, కార్యదర్శి చంద్రశేఖర్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి,టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంత్‌నాయక్‌, రాఘవేందర్‌రెడ్డి, రాజగోపాలచారి, యాదయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

బజ్జనాయక్‌తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

 కులకచర్ల: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కులకచర్ల మండల పరిధిలోని బజ్జనాయక్‌తండాలో రూ.4లక్షల గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శోభ, కార్యదర్శి ఆనంద్‌, ఎంపీటీసీ సంగీత, కో-ఆప్షన్‌ సభ్యుడు జుబేర్‌, రమేశ్‌ పాల్గొన్నారు. 

 రైతులకు అండగా సర్కారు 

 పరిగి : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. పరిగి పట్టణంలోని వల్లభ్‌నగర్‌కు చెందిన రైతు కాకి కృష్ణయ్య ఇటీవల మృతి చెందగా రైతుబీమా కింద ఆయన భార్య లలిత బ్యాంకు ఖాతాలో రూ.5లక్షలు జమ అయ్యాయి. ఇందుకు సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ కాపీని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఆదివారం లలితకు అందజేశారు. 

  సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ

 పరిగి నియోజకవర్గంలోని  పరిగి, పూడూరు, గండీడ్‌ మం డలాల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 21 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.6.80లక్షలకు సంబంధించిన చెక్కులను పరిగిలో ఆదివారం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పరిగి ఎంపీపీ అరవిందరావు, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆంజనేయులు, సర్పంచ్‌ రాజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు రవికుమార్‌, ఆసిఫ్‌, లక్ష్మి పాల్గొన్నారు.


logo