గురువారం 29 అక్టోబర్ 2020
Vikarabad - Sep 28, 2020 , 01:04:27

అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి

అత్యవసరమైతే తప్ప బయటికి రాకండి

- వాగులు దాటేందుకు ప్రయత్నించొద్దు 

- వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

ధారూరు : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున అత్యవసరమైతే తప్ప ఇండ్లలోంచి బయటికి రావొద్దని వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ ప్రజలకు సూచించారు. ఆదివారం ధారూరు మండలం బాచారం వాగు వంతెనను, వర్షానికి దెబ్బతిన్న రోడ్డును ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని చాలా ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని స్థానికులకు సూచించారు. భారీ వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.
logo