మంగళవారం 20 అక్టోబర్ 2020
Vikarabad - Sep 28, 2020 , 01:04:24

డీసీసీబీ అభివృద్ధే లక్ష్యం : చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

డీసీసీబీ అభివృద్ధే లక్ష్యం : చైర్మన్‌ మనోహర్‌రెడ్డి

వికారాబాద్‌ : డీసీసీబీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నాంపల్లిలోని రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నివాళులర్పించి సర్వసభ్య సమావేశాన్ని ప్రారంభించారు. డీసీసీబీ బ్యాంకు వాటా ధనం, నిధులు, డిపాజిట్లు, రాష్ట్ర సహకార బ్యాంకు నుంచి పొందిన రుణాలు, అప్పులు, బకాయిల గురించి సర్వసభ్య సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా నాబార్డ్‌ సంస్థ ఇచ్చే సబ్సిడీ గోదాంల నిర్మాణం, ఇతర అంశాలపై సమీక్షించినట్లు తెలిపారు. డీసీసీబీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెల్దామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, వైస్‌ చైర్మన్‌ మధుకర్‌రెడ్డి, బ్యాంకు వైస్‌ చైర్మన్‌ కొత్త కురుమ సత్తయ్య, డీసీసీబీ డైరెక్టర్‌ బురుకుంట సతీశ్‌, బ్యాంకు సీఈవోపీ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

logo