బుధవారం 28 అక్టోబర్ 2020
Vikarabad - Sep 29, 2020 , 00:41:59

సర్వేలో పూర్తి వివరాలు సేకరించాలి

సర్వేలో పూర్తి వివరాలు సేకరించాలి

వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ చంద్రయ్య

కొడంగల్‌లో ఇంటింటి సర్వే పరిశీలన

కొడంగల్‌:  పట్టణంలో నిర్వహిస్తున్న అర్బన్‌ (ధరణి) పోర్టల్‌ ప్రక్రి య నిబంధనల మేరకు పూర్తి వివరాలు సేకరించాలని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ చంద్రయ్య మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. సోమవారం పట్టణంలో మున్సిపల్‌ సిబ్బంది వార్డులవారీగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్‌ (ధరణి) పోర్టల్‌ నందు సూచించబడ్డ 46 కాలమ్‌ నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలను పూర్తి స్థాయిలో సేకరిస్తేనే ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేసేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంటి యజమాని, ఇంట్లో ఉండే ప్రతిఒక్కరి ఆధార్‌, ఫోన్‌ నంబర్లు, ఆసరా పెన్షన్‌, రేషన్‌ కార్డు వంటి తదితర వివరాలు అందించి ప్రొఫార్మాలో పొందుపర్చాలని తెలిపారు. 

ఇంటి యజమాని చనిపోతే ఇప్పటి వరకు పేరు మార్పిడి ఎందుకు చేయించుకోలేదో  సేకరించాలన్నారు. మున్సిపల్‌ పరిధిలో మొత్తం 3672 ఇండ్లు ఉన్నాయని, ప్రస్తుతం 2700 ఇండ్లకు సంబంధించిన వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరిచినట్లు మున్సిపల్‌ సిబ్బంది తెలిపారు. అనంతరం పట్టణంలో నిర్మించే మరుగుదొడ్లను పరిశీలించారు. పట్టణానికి మంజూరైన 4 రెడీమేడ్‌ మరుగుదొడ్లను ఆయన పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండేలా వాటిని అమర్చాలని, సద్వినియోగం చేసుకునే విధంగా సమకూర్చాలని మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటలక్ష్మికి సూచించారు. పట్టణంలోని ఆయా ప్రాంతాల్లోని పారిద్ధ్యాన్ని పరిశీలించి మురుగు నిలిచిన కాలువలను వెంటనే శుభ్రం చేయించాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది ఆంజనేయులు, భరత్‌ తదితరులు పాల్గొన్నారు. logo