గురువారం 22 అక్టోబర్ 2020
Vikarabad - Sep 17, 2020 , 01:46:38

రెండు కళాశాలలు మంజూరు చేయాలి

రెండు కళాశాలలు మంజూరు చేయాలి

కొడంగల్‌: నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని రెండో శాసనసభ ఆరో సమావేశంలో జీరో అవర్‌లో ఎమ్మెల్యే మా ట్లాడారు. దౌల్తాబాద్‌ మండలంలో 963 మంది బా లికలు, 1016 మంది బాలురు ఉన్నారని, బొంరాస్‌పేట మండలంలో 500లకు పైగా ఇంటర్‌ విద్య ను అభ్యసించే బాలికలు ఉన్నారని తెలిపారు. దాదాపు మూడువేల మంది బాల బాలికలకు అనువుగా ఉండే విధంగా బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోరిన విధంగా ప్రభుత్వ కళాశాలల ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారాని కృషి చేస్తానని హామీ ఇచ్చారు. logo