బంట్వారం : 75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ‘మెగా రికార్డు’ సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని బొపునారం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, గాయకుడు డాక్టర్ సలీమ్‌కు ఉత్తమ సామాజిక కార్యకర్తగా గుర్తించింది. దీంతో తెలంగాణ స్టేట్ స్పెషల్ అడ్వైజర్ వేణుగోపాలచారి, రాష్ట్ర మానవ హక్కుల చైర్మన్ డాక్టర్ చిరుకూరి రామ్ తిలక్‌ల చేతుల మీదుగా ప్లాటినమ్ జూబ్లీ అవార్డును ప్రధానం చేశారు. డాక్టర్ సలీమ్‌కు ఈ అవార్డు రావడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.