శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Feb 24, 2021 , 00:42:59

ఊరూరా గులాబీ దండోరా

ఊరూరా గులాబీ దండోరా

  • కొనసాగుతున్న సభ్యత్వాల నమోదు
  • కొందుర్గులో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌
  • అనూహ్య స్పందన అంటున్న నాయకులు
  • ఇంటింటీకీ తిరుగుతున్న నేతలు

కొందుర్గు, ఫిబ్రవరి 23: సభ్యత్వ నమోదులో కొందుర్గు ఉమ్మడి మండలం ముందుం డాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం జిల్లెడు చౌద రి గూడ మండల కేంద్రంలో  సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పలువురు పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హఫీజ్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ దూలయ్య, సర్పంచ్‌ గూడ వెంక టస్వామి, పీఏసీఎస్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ నర్సింగరావు, నాయకులు నర్సింహులు, చంద్రబాబుగౌడ్‌, కొండి యాదయ్య పాల్గొన్నారు. అలాగే కొం దుర్గు మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో  సభ్యత్వ నమోదు కార్య క్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రాజేశ్‌పటేల్‌ సర్పంచ్‌ ఆదిలక్ష్మీ, మానయ్య, గోపాల్‌, రాజు, రమేశ్‌రెడ్డి, జగదీశ్‌గౌడ్‌, ప్రవీణ్‌, శ్రీకాంత్‌, నిరంజన్‌, పవన్‌, నర్సింహులు, రాంచ్రందయ్య  పాల్గొన్నారు. 

 సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

షాబాద్‌, ఫిబ్రవరి 23: సభ్యత్వ నమోదుకు  ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మంగళవారం షాబాద్‌ మండల పరిధిలోని కుమ్మరిగూడ గ్రా మంలో పార్టీ నాయకులతో కలిసి సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు రూ. 2లక్షల బీమా సదుపాయం కల్పించి అండగా నిలుస్తున్నట్లు స్పష్టం చేశా రు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పొనమోని కేతనరమేశ్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సునిగంటి పాపిరెడ్డి, మంచాని నర్సింహారెడ్డి,  అవిలాశ్‌గౌడ్‌, ఎస్‌జీ నర్సింహు లు, బుక్క రవి, గూళ్ల రంగయ్య, మల్లేశ్‌ ఉన్నారు. 

 తీరుగులేని రాజకీయ శక్తిగా..

నందిగామ, ఫిబ్రవరి23 : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఈట గణేశ్‌ అన్నారు. మంగళవారం నందిగామ మండలం వెంక మ్మ గూడ గ్రామంలో చేగూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, సర్పంచ్‌ రజనిత ఆధ్వర్యంలో నిర్వహించిన  కార్యక్రమానికి జడ్పీ వైస్‌ చైర్మన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌  అంటేనే తెలంగాణ ప్రజలకు ఒక దైర్యమన్నారు.  ప్ర జల గుండెల నిండా గులాబీ జెండా ఉందన్నారు.  కా ర్యక్రమంలో చేగూరు పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ విఠల్‌, బండోనిగూడ సర్పంచ్‌ జెట్టకుమార్‌,  నాయకులు బుగ్గ నర్సిం హా, బండి రాజు, శ్రీను పాల్గొన్నారు. 

తెలంగాణ అభివృద్దే టీఆర్‌ఎస్‌ లక్ష్యం

కేశంపేట ఫిబ్రవరి23:  రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కేశంపేట ఎంపీపీ వై.రవీందర్‌యాదవ్‌ అన్నారు. మండలంలోని సంతాపూర్‌, కొత్త పేటలలో మంగళవారం నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొ న్నారు.  కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ వైస్‌చైర్మన్‌ లక్ష్మీనారాయణగౌడ్‌, జడ్పీటీసీ తాండ్ర విశాల, ఏఎంసీ డైరెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌ మెంబర్‌ జమాల్‌ఖాన్‌, సర్పంచ్‌లు నవీన్‌కుమార్‌, ఎంపీటీసీ మల్లేశ్‌యాదవ్‌, నాయకులు శ్రావణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, కుంటి లక్ష్మ య్య, యాదయ్యగౌడ్‌, మురళీమోహన్‌ పాల్గొన్నారు. 

ఫరూఖ్‌నగర్‌ మండలంలో...

షాద్‌నగర్‌ రూరల్‌, ఫిబ్రవరి 23: ఫరూఖ్‌నగర్‌ మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్‌ ఎస్‌ సభ్యత్వాలు  కొనసాగుతున్నాయి. నాగులపల్లి, రాసు మల్లగూడ గ్రామాల్లో మంగళ వారం ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌ అహ్మద్‌, జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, సర్పంచ్‌ మాధవీరం గయ్య పార్టీ సభ్యత్వాలను చేయించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు గోపాల్‌ రెడ్డి, లక్ష్మణ్‌నాయక్‌, శ్రీనివాస్‌, బోజిరెడ్డి, పోచయ్య, రంగయ్య పాల్గొన్నారు. 

 శంకర్‌పల్లి ముందుండాలి

శంకర్‌పల్లి టౌన్‌,ఫిబ్రవరి23:  శంకర్‌పల్లి మండల కేంద్రంలోని వార్డుల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ శంకర్‌పల్లి మండల నాయకులు, కార్యకర్తలు  సభ్యత్వాల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ సభ్యత్వాల నమోదులో జిల్లాలో శంకర్‌పల్లి మండలాన్ని ముందంజలో ఉంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మం డల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్‌ చైర్మన్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

 విజయవంతం చేయండి

శంకర్‌పల్లి రూరల్‌ ఫిబ్రవరి 23: సభ్వత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శంకర్‌పల్లి మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కావలి గోపాల్‌ పిలుపునిచ్చా రు. మంగళవారం మాసానిగూడ, పర్వేద, ప్రొద్దటూరు గ్రామాల్లో పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నదన్నారు కార్యక్రమంలో ప్రొద్దటూరు సర్పంచ్‌ నర్సింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి  పాల్గోన్నారు. 


VIDEOS

logo