సూక్ష్మకళకు జాతీయస్థాయి గుర్తింపు

- పెన్సిల్‌పై శివాజీ.. జాతీయ స్థాయిలో పదో ర్యాంకు
- మైక్రో ఆర్ట్స్‌లో రాణిస్తున్న మణిశంకర్
తాండూరు, ఫిబ్రవరి 22: మనకు ఏకళపై మక్కువ ఉంటుందో దానిపై శ్రద్ధ పెడితే దానిలో రాణించవచ్చని నిరూపిస్తున్నాడు తాండూరు పట్టణానికి చెందిన మణిశంకర్. తాండూరుకు చెందిన సురేశ్‌కుమార్, శోభారాణి దంపతుల కొడుకు మణిశంకర్ తాండూరు పీపుల్స్ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతున్నాడు. పాఠశాల స్థాయి నుంచి తెల్లటి కాగితాలపై జీవం ఉట్టిపడేలా బొమ్మలను వేస్తు పలువురి ప్రశంసలను అందుకుంటున్నాడు. స్కెచ్ వర్కు, ఆర్ట్ వర్కు, క్రాప్ట్ వర్కుతో పాటు 2020 మార్చి 28 నుంచి అత్యద్భుతంగా పెన్సిల్‌పై మైక్రో ఆర్ట్స్ వేయడం ప్రారంభించి పెన్సిల్‌పై రకరకాల సూక్ష్మ కళాఖండాలను (బొమ్మలు, వివిధ పేర్లను) రూపొందిస్తూ అందరిని అబ్బుర పరుస్తున్నాడు. 2021 ఫిబ్రవరి 19న శివాజీ జయంతిని పురస్కరించుకొని పెన్సిల్‌పై వేసిన ఛత్రపతి శివాజీ బొమ్మను ఇండియన్ మినిస్టరి ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వారు ఇన్స్టాగ్రామ్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 19న నిర్వహించిన ఈ పోటీల్లో మణిశంకర్ పెన్సిల్ లీడ్‌పై వేసిన ఛత్రపతి శివాజీ బొమ్మతో పోటీలో పాల్గొన్నాడు. జాతీయ స్థాయిలో 21 వేల మంది పాల్గొనగా ఈ పోటీల్లో తాండూరుకు చెందిన మణిశంకర్ 10వ ర్యాంకు సాధించాడు. ఆ సంస్థ మణిశంకర్‌ను అభినందిస్తూ సోమవారం సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.
ఆర్టిస్టు కావాలన్నదే నా లక్ష్యం : మణిశంకర్
పట్టుదల, ఆసక్తి, ఆలోచనతో బొమ్మలు వేయడం ప్రారంభించడంతో చక్కగా పటాలు వేయడం వచ్చింది. అలా అలవాటైన డ్రాయింగ్ ఇతరత్రా అంశాలపై కూడా సాధన చేశాను. ప్రస్తుతం స్కెచ్వర్కు, ఆర్ట్వర్కు, క్రాప్ట్వర్కు, మైక్రోఆర్ట్ చేస్తున్నాను. జాతీయ స్థాయిలో 21 వేల మంది పాల్గొన్న పోటీల్లో నాకు టాప్ 10 ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో సివిల్ ఆఫీసర్, మంచి ఆర్టిస్టు కావాలన్నదే నా లక్ష్యం.
తాజావార్తలు
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!
- ఆ ఐదు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కొత్త కేసులు
- మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్