మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Feb 22, 2021 , 00:37:05

ఊరూరా జోరుగా..

ఊరూరా జోరుగా..

  • టీఆర్‌ఎస్‌ బలోపేతానికి కృషి చేయాలి
  • టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ పాషా
  • లక్ష్యానికి మించి సభ్యత్వం చేద్దాం
  • ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
  • పార్టీ సభ్యత్వానికి విశేష స్పందన

తాండూరు, ఫిబ్రవరి 21: టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ పాషా అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్‌ పరిధిలోని ఎన్టీఆర్‌ కాలనీలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు చేపట్టారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులైన కాలనీ ప్రజలు, ముస్లిం మైనార్టీలు స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు మహిళలకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ పాషా మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి విశేష స్పందన వస్తున్నదన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీప, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ పి.వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్‌ రాఘవేందర్‌, టీఆర్‌ఎస్‌ నేతలు మురళీగౌడ్‌, నర్సింహులు, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌చారి, ఇర్షాద్‌, సంతోశ్‌గౌడ్‌, సంజీవ్‌రావు, మోహిజ్‌, రాజన్‌గౌడ్‌, రజాక్‌, అనిల్‌ పాల్గొన్నారు.

స్వచ్ఛందంగా సభ్యత్వం..  

ఎన్‌టీఆర్‌ కాలనీలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహిస్తుండగా కాలనీకి చెందిన ఫెరోద్స్‌ ఫాతిమా, అజీజాబేగం తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నామని చెప్పారు. 

VIDEOS

logo