పన్ను వసూళ్లు ముమ్మరం

- పరిగి మున్సిపాలిటీ పన్నుల వసూలు లక్ష్యం రూ.కోటి 68లక్షలు
- వసూలైనవి రూ.65.87లక్షలు
- ఈ సంవత్సరం 50శాతం రాయితీ
పరిగి, ఫిబ్రవరి 21 : స్థానిక సంస్థలకు పన్నుల వసూలే ఆదాయ వనరులు. వాటిని పూర్తిస్థాయిలో వసూలు చేయడం ద్వారా అభివృద్ధికి మరింత అవకాశం కలుగుతున్నది. ఈ దిశగా పరిగి మున్సిపాలిటీ పరిధిలోనూ 100శాతం పన్నుల వసూలు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం రూ.కోటి 68లక్షలు పన్నులు వసూలు కావాల్సి ఉన్నది. వాటిలో రూ.కోటి 49లక్షలు ప్రైవేటు, రూ.18.75లక్షలు ప్రభుత్వ ఆస్తులకు సంబంధించిన పన్నులు వసూలు చేయాల్సి ఉన్నది. ఈ సంవత్సరం పన్నుల వసూలు డిమాండ్ 65లక్షలు ఉండడం గమనార్హం. మిగతాది పాత బకాయిలని చెప్పవచ్చు. పన్నుల వసూళ్లకు సంబంధించి ఆన్లైన్లో ఫీడ్ చేసి రసీదులు అందిస్తున్నారు.
రూ.65.87లక్షలు వసూలు
పరిగి మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్నుల వసూలు మరింత వేగవంతం చేశారు. పాత బకాయిలు, ఈసారి బకాయిలు కలిపి మొత్తం రూ.కోటి 68లక్షలకుగాను రూ.65.87లక్షలు ఇప్పటివరకు వసూలు చేశారు. ఇందులో ప్రైవేటుకు సంబంధించి రూ.60లక్షలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి రూ.5.87లక్షలు వసూలయ్యాయి. ఇకపోతే రూ.92లక్షలు పన్నులు వసూలు కావాల్సి ఉన్నది. కరోనా నేపథ్యంలో పన్నుల వసూలుకు సంబంధించి 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50శాతం రాయితీ ప్రకటించింది. గతంలోని పాత బకాయిలన్నీ పూర్తిస్థాయిలో చెల్లించిన వారికి ఈ సంవత్సరం పన్నులో 50శాతం రాయితీ వర్తిస్తున్నది. దీంతో పాత బకాయిలు వసూలు చేయడంతోపాటు ఈ సంవత్సరం బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరుగాలని నిర్ణయించారు. ఇప్పటికే పట్టణంలోని అన్ని కాలనీల్లో పన్ను చెల్లింపుపై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వంద శాతం పన్ను వసూలు లక్ష్యంగా పనిచేస్తున్నారు.
పన్నులు వసూలు చేస్తాం
మున్సిపాలిటీ పరిధిలో 100శాతం పన్నులు వసూలు చేస్తాం. పన్నుల వసూలు రసీదులకు ఒకే మిషన్ ఉన్నందున, మరో మూడు మిషన్లు ఇవ్వాలని కోరాం. పూర్తిస్థాయిలో పన్నుల వసూలుకు సంబంధించి పన్నుల చెల్లింపుపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం. పన్నుల వసూలు వేగవంతం చేసి మార్చి నెలాఖరు లోపు వందశాతం పన్నులు వసూలు చేస్తాం. పాత బకాయిలు చెల్లించిన వారికి ఈ సంవత్సరం పన్నులో ప్రభుత్వం రాయితీ సదుపాయం కల్పించింది. ఈ సదుపాయం సద్వినియోగం చేసుకోవాలి.
- ప్రవీణ్‌కుమార్, కమిషనర్ పరిగి మున్సిపాలిటీ
తాజావార్తలు
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏండ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!