శుక్రవారం 05 మార్చి 2021
Vikarabad - Feb 22, 2021 , 00:37:05

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

  • తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి 

పెద్దేముల్‌, ఫిబ్రవరి 21 : నాణ్యతా ప్రమాణాలు పాటించి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాండూరు-తొర్మామిడి, పెద్దేముల్‌ నుంచి సిద్దన్నమదుగు తండా వరకు చేపట్టిన డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులను నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ రోడ్ల నిర్మాణాలన్ని త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణ పనుల్లో సంబంధిత కాంట్రాక్టర్లు, నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వం గ్రామ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో రోడ్లను వేయిస్తున్నదని, మండలంలో రోడ్ల పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ పాషా, పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కోహిర్‌ శ్రీనివాస్‌యాదవ్‌, పార్టీ నాయకులు టి.రమేశ్‌, కొమ్ము గోపాల్‌రెడ్డి, మురళీగౌడ్‌, నర్సింహారెడ్డి(రాజు), పట్లోళ్ల నర్సింహులు, తాండూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌ నాయక్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, డీవై ప్రసాద్‌, రఘు మారెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo