ఆదివారం 07 మార్చి 2021
Vikarabad - Feb 22, 2021 , 00:37:07

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై

ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై

  • స్వచ్ఛందంగా ముందుకొస్తున్న ప్రజలు

ధారూరు, ఫిబ్రవరి 21 : పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని టీఆర్‌ఎస్‌ పార్టీ ధారూరు మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం ధారూరు మండలం నాగుసాన్‌పల్లి, తరిగోపుల గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. పల్లెల్లో పండుగలాగా సభ్యత్వ నమోదు జరుపుకొంటున్నారన్నారు. కార్యక్రమంలో తరిగోపుల, నాగుసాన్‌పల్లి గ్రామాల సర్పంచులు వెంకటయ్య, విశాల, నాయకులు యాదయ్య, శ్రీనివాస్‌, దామోదర్‌, నర్సింహులు, రామయ్య, కిష్టయ్య, సత్తయ్య, వెంకటయ్య, రాములు, రాంచంద్రయ్య, నాగారావు, రాజారావు, పెంటయ్య, యాదవ్‌రావు, సంజీవరావు పాల్గొన్నారు.

సుల్తాన్‌పూర్‌లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

దౌల్తాబాద్‌, ఫిబ్రవరి 21 : మండలంలోని సుల్తాన్‌పూర్‌ గ్రామంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జడ్పీటీసీ కోట్ల మహిపాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బుడ్డప్ప, టీఆర్‌ఎస్‌ నాయకులు బాలకిష్టప్ప, కృష్ణయ్య, మాధవులు, హన్మంతు పాల్గొన్నారు.

సభ్యత్వ నమోదు త్వరగా పూర్తి చేయాలి

కొడంగల్‌, ఫిబ్రవరి 21 : సభ్యత్వ నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేసేలా నాయకులు, కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో మున్సిపల్‌ కౌన్సిలర్‌, నియోజకవర్గ అధికార ప్రతినిధి మధుసూదన్‌యాదవ్‌ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ క్రియాశీలక సభ్యత్వాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు ఊరూరా మేళా మాదిరిగా కొనసాగుతున్నదని, 50వేల సభ్యత్వ నమోదు టార్గెట్‌కుగాను ప్రస్తుతం 40వేలకు పైగా సభ్యత్వాలు పూర్తయినట్లు పేర్కొన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో లక్ష్యం మేరకు సభ్యత్వాలను పూర్తి చేయాలని తెలిపారు. అవసరం మేరకు మరిన్ని సభ్యత్వ నమోదు పుస్తకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరగా సభ్యత్వాలు పూర్తి చేస్తే ఆన్‌లైన్‌ ప్రక్రియ చేపట్టుకునే అవకాశం ఉంటుందని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్యాసం రామకృష్ణ, రాహుల్‌యాదవ్‌, శ్రీమన్‌రావ్‌ పాల్గొన్నారు. 

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుంది

వికారాబాద్‌, ఫిబ్రవరి 21 : టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని, అందుకు ప్రతిఒక్కరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌ షరీఫ్‌ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 9వ వార్డు గంగారంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసి వడ్డె అంజయ్యకు సభ్యత్వ నమోదు రసీదును అందజేశారు. అనంతరం ముత్తహర్‌ షరీఫ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటుందని తెలిపారు. సభ్యత్వం ద్వారా కుటుంబంలో ఒకరికి ప్రమాద బీమా వర్తిస్తుందని తెలిపారు. 

VIDEOS

logo