సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Feb 18, 2021 , 00:49:22

హరిత ప్రేమికుడు సీఎం కేసీఆర్‌

హరిత ప్రేమికుడు సీఎం కేసీఆర్‌

  • టీఆర్‌ఎస్‌ హయాంలోనే ప్రతి కుటుంబానికి న్యాయం
  • ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు

వికారాబాద్‌, ఫిబ్రవరి 17: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేక్‌ కట్‌చేసి, పావురాలను ఆకాశంలోకి వదిలారు. ఎమ్మెల్యే యువసేన ఆధ్వర్యంలో రాజీవ్‌ గృహకల్పలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మున్సిపల్‌లోని ఎన్నెపల్లిలో మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిండు నూరేండ్లు చల్లగా ఉండాలని కోరుకున్నారు. కేసీఆర్‌ పాలనలో ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుతున్నదన్నారు. ఐదేండ్లలో హరితహారంతో కోట్ల మొక్కలు నాటారన్నారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ తీసుకున్న గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా ప్రతి గ్రామంలో 1000 మొక్కలు నాటారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగం, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ ముత్యంరెడ్డి, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌ షరీఫ్‌, కౌన్సిలర్లు, అనంత్‌రెడ్డి, ఆర్‌.నర్సింలు, కృష్ణ నవీన్‌, చందర్‌నాయక్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌, దత్తు, అశోక్‌, షఫీ, సుభాన్‌రెడ్డి, గిరీశ్‌ కొఠారి పాల్గొన్నారు. 

కోట్‌పల్లిలో..

కోట్‌పల్లి, ఫిబ్రవరి17: సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌, నాయకులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం బుగ్గాపూర్‌, బార్వాద్‌, రాంపూర్‌ గ్రామాల్లోని ప్రకృతి వనంలో మొక్కలు నాటారు. ఒగ్లపూర్‌లో సర్పంచ్‌ శోభారాణి ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో రాములు, పాండు, మహేందర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. 

మర్పల్లిలో 

మర్పల్లి, ఫిబ్రవరి 17: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదిన వేడుకలు మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ లలిత రమేశ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లేశం, వైస్‌ ఎంపీపీ మోహన్‌రెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ఫసీయుద్ధీన్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు సోహెల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రైతు బంధు మండల అధ్యక్షుడు నాయబ్‌గౌడ్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌గుప్తా, అశోక్‌, గౌస్‌, గఫర్‌, రామేశ్వర్‌, మధుకర్‌, ఖాజా, రవీందర్‌రెడ్డి, వసంత్‌ పాల్గొన్నారు.

ధారూరులో 

ధారూరు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో, కేజీబీవీలో పండ్లు పంపిణీ చేశారు. దవాఖానలో ఎంపీపీ  విజయలక్ష్మి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌ రెడ్డి, నాయకులు  మొక్కలు నాటారు. స్టేషన్‌ ధారూరు, అల్లాపూర్‌ గ్రామాల్లో నాయకులు సర్పంచులు, ఎంపీటీసీలు మొక్కలు నాటి నీరు పోశారు.

బంట్వారంలో..

బంట్వారం: పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గంచెర్వు మల్లేశం మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు ఖాజాపాషా, మాజీ ఎంపీపీ రాములు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మోమిన్‌పేటలో..

మోమిన్‌పేట, ఫిబ్రవరి 17: సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటడం సంతోషంగా ఉందని జడ్పీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో మొక్కలు నాటారు. అనంతరం ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మండలంలోని టేకులపల్లిలో పీఏసీఎస్‌ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఐ వెంకటేశం, ఎక్సైజ్‌ ఎస్సై శేఖర్‌తో కలసి మొక్కలు నాటారు. ఎన్కతలలో సర్పంచ్‌ అలివేలమ్మ, నాయకులు బక్కారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జనార్దన్‌ మొక్కలు నాటారు. కార్యక్రమంలోఎంపీటీసీలు బాగ్దాద్‌ కృష్ణారెడ్డి, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, కాశీరాం, శ్రీనివాస్‌రెడ్డి, మర్పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ లక్ష్మయ్య, నాయకులు వెంకట్‌, సంగమేశ్వర్‌ గుప్తా, తిరుపతి రెడ్డి, అనూప్‌ రెడ్డి, కరుణాకర్‌ రెడ్డి పాల్గొన్నారు.


VIDEOS

logo