గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

- పాడి పశువుల పంపిణీకి పైలెట్ ప్రాజక్టుగా కొడంగల్ ఎంపిక
- బొంరాస్‌పేట మండలంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు కృషి
- బంజారా భవన్ నిర్మాణానికి రూ.1.50కోట్లు
- సేవాలాల్ జయంతిలో మంత్రులు సబితారెడ్డి, సత్యవతిరాథోడ్
గిరిజనుల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణ శివారులోని సిద్ధినాంపు మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన బంజారా భవన్ స్థలంలో సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని భోగ్‌భండార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి హాజరై మాట్లాడారు. సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందన్నారు. గిరిజనులకు పాడి పశువులను అందించే పథకం అమలుకు కొడంగల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారన్నారు. బొంరాస్‌పేట మండలంలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
- పాడి పశువుల అందజేతతో ఆర్థికాభివృద్ధి
- రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక
- ఉత్సవం నిర్వహణకు రూ.కోటి నిధులు
- బంజరా భవన్ నిర్మాణానికి రూ.1.50కోట్లు
- సేవాలాల్, మరియమ్మ ఆలయాల నిర్మాణానికి కృషి
- బొంరాస్‌పేటలో ఏకలవ్య పాఠశాల ఏర్పాటుకు కృషి
- మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్
- అంగరంగ వైభవంగా భోగ్‌భండార్
కొడంగల్, ఫిబ్రవరి 15: గిరిజన అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, అందుకోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ శివారులోని సిద్ధినాంపు మిషన్ భగీరథ గ్రిడ్ వద్ద ప్రభుత్వం మంజూరు చేసిన బంజారా భవన్ స్థలంలో సంత్ సేవాలాల్ 282వ జయంతి సందర్భంగా గిరిజనులు భోగ్‌భండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నదని, అందుకే నేడు గిరిజన బిడ్డలు టీఆర్ఎస్కు వెన్నంటి ఉన్నారని అన్నారు. స్వపరిపాలనే లక్ష్యంగా తండాలను పంచాయతీలుగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దుతున్నారన్నారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాలనే ఆలోచనతో రూ.కోటి నిధులు మంజూరు చేశారన్నారు. మంత్రి కేటీఆర్ గిరిజనులకు పాడి పశువులు అందించే పథకంలో భాగంగా కొడంగల్ ప్రాంతాన్ని రూ.10 కోట్లతో పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారన్నారు. ఇందులో భాగంగా గిరిజనులకు యూనిట్ల అందజేతపై బ్యాంక్, విజయ డైరీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గిరిజనులు కోరిన ప్రకారం రూ.1.50కోట్లతో బంజారా భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశారన్నారు. సేవాలాల్, మరియమ్మ దేవాలయాల నిర్మాణాలకు ప్రత్యేకంగా మరో రూ.కోటి మంజూరు చేసేలా చూడాలని మంత్రులను గిరిజన నాయకులు కోరారు. ఎన్నికల కోడ్ ఉన్నందున మంజూరైన నిధులతో భూమిపూజలో జాప్యం ఏర్పడినట్లు మంత్రులు తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో 153 గిరిజన తండాలు ఉన్నాయని, అందులో 46 పంచాయతీలు ఉన్నాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. గత సెన్సెస్ ప్రకారం 32వేల జనాభా ఉందని, కాబట్టి ఇక్కడి గిరిజన ప్రజలకు అన్ని హంగులతో కూడిన ఏకలవ్య మోడల్ పాఠశాల ఏర్పాటు చేసేలా మంత్రులతో కలిసి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సేవాలాల్ జయంతి ఉత్సవం రోజున సెలవు దినంగా ప్రకటించేలా సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. త్వరలో సాగునీరు కొడంగల్‌కు రానున్నట్లు తెలిపారు.
నాయక్‌గా ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి..
గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతిసారి మా నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో గిరిజనులు ఉన్నారని, వారి అభివృద్ధికి కృషి చేయాలని కోరుతారన్నారు. ఆయనను చూస్తుంటే.. నరేందర్ నాయక్‌గా పిలుచుకోవాలనిపిస్తున్నదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు ముద్దప్ప దేశ్‌ముఖ్, విజయ్‌కుమార్, బొంరాస్‌పేట జడ్పీటీసీ అరుణా రేణుదేశు, దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్, కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషా రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, నాయకులు జహంగీర్‌పాషా, బాల్‌సింగ్‌నాయక్, బంజారా సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు టీటీ రాములు, దేశ్యానాయక్, రామునాయక్, దత్తు నాయక్, నెహ్రూనాయక్, శంకర్‌నాయక్, అనిల్ నాయక్, సిత్యానాయక్, పాండు నాయక్ పాల్గొన్నారు
తాజావార్తలు
- కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించిన డీఎంకే
- ప్రదీప్ హీరోయిన్ క్యూట్ పిక్స్ వైరల్
- దేశంలో కొత్తగా 18,711 పాజిటివ్ కేసులు
- హుజురాబాద్ శివారులో ప్రమాదం : ఒకరు మృతి
- మహేష్ బర్త్ డే రోజు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్
- శర్వానంద్‌కు మెగాస్టార్, కేటీఆర్ సపోర్ట్..!
- తాజ్ మహల్ సాక్షిగా వివాహ వార్షికోత్సవం..
- భయపెడుతున్న భానుడి భగభగలు
- అమరచింత మాజీ ఎమ్మెల్యే మృతి
- కబడ్డీ కోర్టులో కొండెంగ.. నేను ఆడుతా!