బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Feb 14, 2021 , 01:00:25

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు

  • విస్తృతంగా ప్రచారం చేయాలి 
  •  పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి 

పరిగి, ఫిబ్రవరి 13 : తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వం ఆత్మగౌరవానికి ప్రతీక అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగిలో జరిగిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సభ్యత్వం కలిగివుండడం గౌరవప్రదమని అన్నారు. ప్రతి కార్యకర్తకు రూ.2లక్షలు బీమా సదుపాయం కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతున్నదన్నారు. పరిగి నియోజకవర్గంలో పలువురు కార్యకర్తలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందితే బీమా డబ్బులు వచ్చాయన్నారు. ఈసారి అధికంగా సభ్యత్వాలు చేయిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతున్నదని విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. ఈ బడ్జెట్‌లో ఏసీడీపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు నిధులు కేటాయించనున్నారని, తద్వారా గ్రామాల్లో మరింత పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌పాషా మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో 60వేల పైచిలుకు సభ్యత్వ నమోదు చేయిస్తామని ముందుకు రావడం హర్షణీయమన్నారు. డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వ నమోదు చేయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌ పాషా టీఆర్‌ఎస్‌ సభ్యత్వం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు కె.నాగారెడ్డి, బి.హరిప్రియ, మలిపెద్ది మేఘమాల, రాందాస్‌, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు మల్లేశం, సత్యమ్మ, మాధవి, మున్సిపల్‌ చైర్మన్‌ ముకుంద అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఆయా మండలాల అధ్యక్షులు ఆర్‌.ఆంజనేయులు, మహిపాల్‌రెడ్డి, సారా శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ, హన్మంతు, నాయకులు కొప్పుల అనిల్‌రెడ్డి, మేడిద రాజేందర్‌, కె. శ్రీనివాస్‌రెడ్డి, మీర్‌ మహమూద్‌అలీ, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎ.సురేందర్‌కుమార్‌, హఫీజ్‌, అజారుద్దీన్‌, మల్లేశం, పీరంపల్లి రాజు, ఎస్‌.భాస్కర్‌, రాఘవేందర్‌రెడ్డి, సువర్ణ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo