లక్ష్యాన్ని చేరుకోవాలి

- జిల్లాలో బూత్‌స్థాయి కమిటీలు చేస్తాం
- టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి జహంగీర్ పాషా
- జిల్లా కేంద్రంలో జోరుగా సభ్యత్వ నమోదు
వికారాబాద్, ఫిబ్రవరి 12 : సభ్యత్వ నమోదులో వికారాబాద్ జిల్లా మొదటిస్థానంలో ఉండాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ, జిల్లా ఇన్చార్జి జహంగీర్‌పాషా అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలతో నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ జిల్లా ఇన్చార్జిగా జహంగీర్ పాషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మండలం నుంచి 10 వేలు తగ్గకుండా సభ్యత్వ నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన చెప్పారు. మండలాల్లో 10 వేలు, మున్సిపాలిటీల్లో 15 వేల సభ్యత్వ నమోదుచేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తున్నదన్నారు. త్వరలో బూత్ స్థాయి కమిటీలు వేస్తామన్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు వివరించాలని సూచించారు. అనంతరం మర్పల్లి మండలం కోట్‌మర్పల్లి గ్రామానికి చెందిన శోభకు ప్రమాద బీమా కింద మంజూరైన రూ.2లక్షలను అందజేశారు. ఈ సమావేశంలో విద్యా మౌలిక సదుపాయల కల్పన సంస్థ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ నర్సింహులుగుప్తా, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శుభప్రద్‌పటేల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, జడ్పీటీసీ ప్రమోదినీ, మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ హపీజ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, నియోజకవర్గ స్థాయి పార్టీ అధ్యక్షుడు, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, రైతు బంధు అధ్యక్షుడు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
- దేశంలో కొత్తగా 15 వేల కరోనా కేసులు
- మరోసారి పెరిగిన వంటగ్యాస్ ధరలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!