శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Feb 12, 2021 , 00:38:46

వికారాబాద్‌కు రథయాత్ర

వికారాబాద్‌కు రథయాత్ర

  • లోక కల్యాణం కోసమే ఈ కార్యక్రమం
  • రాష్ట్రంలోని ఆలయాలన్నీ సందర్శిస్తాం
  • తెలంగాణాలో అర్చకులకు సముచిత స్థానం
  • అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ 
  • లోక కల్యాణం కోసం రథయాత్ర 
  • రాష్ట్రంలోని 2.544 ఆలయాలను సందర్శిస్తాం
  • తెలంగాణాలోనే ఆర్చకులకు సముచిత స్థానం
  • వేతనాలు పెంచి సీఎం కేసీఆర్‌ ఆదుకున్నారు
  • ఆర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ 

వికారాబాద్‌, ఫిబ్రవరి 11: లోక కల్యాణం కోసం, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అర్చక రథయాత్ర నిర్వహిస్తున్నట్లు ధూపదీప నైవేధ్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్‌ వాసుదేవశర్మ పేర్కొన్నారు. ఈ నెల 6న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి ప్రారంభమైన అర్చక రథయాత్ర గురువారం వికారాబాద్‌ జిల్లాకు చేరుకున్నది. వికారాబాద్‌లోని ఆలంపల్లి నుంచి అనంతగిరి అనంతపద్మనాభ స్వామి దేవాలయం వరకు బైక్‌ ర్యాలీతో రథయాత్రకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం మరింత పురోభివృద్ధి సాధించాలని రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్చకులకు సముచిత స్థానం లభిస్తున్నదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ధూపదీప నైవేధ్య పథకం కింద రూ.2500 అందేదని, ప్రస్తుతం తెలంగాణ సర్కారు రూ.6 వేలకు పెంచిందని అన్నారు. సుమారు 10 వేల మంది ఆర్చకుల జీవితాల్లో వెలుగు నింపిందని కొనియాడారు. ఈ రథయాత్ర ఈనెల 17వ తేదీన హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో పూర్ణాహుతి, చండీ హోమంతో ముగుస్తుందన్నారు. రాత్రి వరకు అనంతగిరిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. రాత్రి ఆలయంలోనే బసచేసి, తెల్లవారుజామున మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మన్యంకొండలో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం చేరుకుంటామన్నారు. ఈ యాత్రలో శేషగిరి పంతులు, అనంతగిరి పం తులు, రఘుపంతులు, ఆర్చకులు పాల్గొన్నారు.

2.544 ఆలయాలను సందర్శిస్తాం

లోక కల్యాణం కోసమే రథయాత్ర చే పట్టాం. రాష్ట్రంలోని 2544 దేవాలయాలను సందర్శిస్తాం. సీఎం కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దేవతామూర్తులను పవిత్ర నదీ జలాలతో అభిషేకిస్తాం. ఆర్చకులకు న్యాయం జరిగింది. కేసీఆర్‌ను దేవుడు చల్లగా 

- దౌలాతాబాద్‌ వాసుదేవరశర్మ, రాష్ట్ర అధ్యక్షుడు 

ఆర్చకులకు సముచిత స్థానం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కష్టాలు ఎదుర్కొన్న ఆర్చకులకు తెలంగాణ ప్రభు త్వం అండగా నిలిచింది. ధూప దీప నైవేధ్య పథకం కింద ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేతనాలను పెంచడంతో సంతోషంగా ఉంది. దీంతో రాష్ట్రంలోని 10వేల మంది అర్చకులు సంతోషంగా ఉన్నారు.

- నందనం హరికిషన్‌ శర్మ, కోశాధికారి

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

ధూపదీప నైవేద్య పథకం కింద అర్చకుల వేతనాలు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. కరోనా కష్ట కాలం లో దేవాలయాలు మూసివేయడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. అర్చకులకు రాష్ట్ర ప్రభు త్వం అండగా నిలువడం ఆనందంగా ఉంది. కేసీఆర్‌ చల్లంగా ఉండాలి.

- జోషి సునీల్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

నిత్యపూజలతో పెరిగిన ఆధ్యాత్మికత 

జిల్లాలో నిరాదరణకు గురైన అనేక ఆలయాలను గుర్తిం చి వాటి అభివృద్ధితో పాటు అర్చకుల వేతనాలు పెంచి నందుకు ముఖ్యమంత్రి కృషి చేయడం సంతోషకరం. కేసీఆర్‌ పాలన సుభిక్షంగా సాగేందుకు తాము నిత్యం పూజలు చే స్తాం. ఆయన వల్లే మాకు న్యాయం జరిగింది.

- జయతీర్థచారి, అర్చక సంఘం వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు

VIDEOS

logo