శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Feb 11, 2021 , 00:17:42

నూతన విధానాలతో దిగుబడి

నూతన విధానాలతో దిగుబడి

పరిగి, ఫిబ్రవరి 10 : అధునాతన విధానాలతో పంటల సాగు చేపట్టి దిగుబడి సాధించాలని పరిగి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకుడు వీరప్ప సూచించారు. బుధవారం పరిగి మండలం నస్కల్‌లోని రైతువేదికలో నిర్వహించిన సమావేశానికి ఏడీఏ వీరప్ప హాజరై మాట్లాడుతూ రైతులు కూరగాయలు, పసుపు, కొత్తిమీర పంటలు సాగు చేస్తున్నారని, వ్యవసాయాధికారుల సూచనలతో పంటల సాగు చేపడితే మంచి దిగుబడి సాధించవచ్చని చెప్పారు. సబ్సిడీపై రెయిన్‌ డ్రిప్‌ అందజేయడానికి ఉద్యానవన శాఖ కమిషనర్‌ ప్రకటించారన్నారు. సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సంతోషి, ఏఈవో, రైతులు పాల్గొన్నారు. 

సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

దోమ, ఫిబ్రవరి 10 : మండల కేంద్రంలోని రైతువేదికలో వరి పంట సాగు విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం క్లస్టర్‌ స్థాయి రైతులకు అవగాహన కార్యక్రమం ఏవో శ్వేతాకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సర్పంచ్‌ రాజిరెడ్డి పాల్గొనగా, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి సాగు అనంతరం తెగుళ్లు ఆశించకుండా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. అనంతరం సర్పంచ్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ ఏఈవోలు క్షేత్రస్థాయిలో పొలాలను సందర్శించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఏవోను కోరారు. కార్యక్రమానికి హాజరైన నిరంజన్‌రెడ్డి రూ.10 వేలు, సత్యనారాయణరెడ్డి రూ.5 వేలు, ఈరారం వెంకటయ్య రూ.2500 రైతువేదికలో వసతుల కల్పనకు విరాళం అందజేశారు. కార్యక్రమంలో ఏఈవోలు చెన్నయ్య, బాబ్యానాయక్‌, కావ్య, దుర్గా ప్రసన్న, రైతులు పాల్గొన్నారు.


VIDEOS

logo