క్రీడలతో మానసికోల్లాసం

వికారాబాద్, ఫిబ్రవరి 9 : క్రీడలతో మానసికోల్లాసం పెరుగుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో కేసీఆర్ కప్ పేరుతో వాలీబాల్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారులను ప్రొత్సహించేందుకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత అదేశాలతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున ఎంపీ సంతోష్‌కుమార్ చేపడుతున్న కోటి వృక్షార్చనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, వాలీబాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షురాలు పుణ్యవతి, పీఏసీఎస్ చైర్మన్ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కమాల్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రైతులు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ధారూరు, ఫిబ్రవరి 9 : రైతు వేదికలలో నిర్వహించే రైతు శిక్షణ కార్యక్రమాన్ని అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం ధారూరు మండలం కెరెళ్లి గ్రామంలోని రైతు వేదికలో కెరెళ్లి, ఎబ్బనూర్, అల్లీపూర్, హరిదాస్‌పల్లి, చింతకుంట గ్రామాల రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు వేదికల్లో పంటల సాగులో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ధారూరు ఎంపీపీ విజయలక్ష్మి, జడ్పీటీసీ సుజాత, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు రాంరెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి జ్యోతి, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు జగపతిరావు, శశిభూషణ్, నవీన్‌కుమార్, సర్పంచ్ నర్సింహారెడ్డి, ఎబ్బనూర్ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు
తాజావార్తలు
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!