సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Feb 10, 2021 , 02:55:21

పైరవీ లేకుండా పథకాల అమలు

పైరవీ లేకుండా పథకాల అమలు

పరిగి, ఫిబ్రవరి 9 : పైరవీలకు తావులేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని మండల పరిషత్‌ కార్యాలయంలో 115 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి రూ.1,14,88,340 చెక్కులను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. గతంలో ఏ పథకం అమలు కావాలన్నా పైరవీలు జరిగేవన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతికి తావులేకుండా అర్హులైన వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. పెండింగ్‌లో ఉన్న షాదీముబారక్‌ చెక్కులు త్వరలోనే అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్యాంసుందర్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌, తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డి, ఎంపీడీవో సుభాష్‌చంద్రగౌడ్‌, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు హఫీజ్‌ పాల్గొన్నారు. 

ప్రధానోపాధ్యాయుడు చెర్క సత్తయ్యకు సన్మానం 

సామాజిక సేవలో చెన్నైకు చెందిన గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ పొందిన సుల్తాన్‌పూర్‌ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం చెర్క సత్తయ్యను మంగళవారం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సన్మానించారు. 


VIDEOS

logo