బార్ల దరఖాస్తుల కోసం గడువు పెంపు

వికారాబాద్,ఫిబ్రవరి 9: జిల్లాలోని తాండూరు, పరిగి, కొడంగల్‌లకు కొత్త బార్ల లైసెన్స్ కోసం దరఖాస్తు గడువును ఈనెల 16 వరకు పొడి గించినట్లు జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి వరప్ర సాద్ తెలిపారు. మంగళవారం జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వికారాబాద్ జిల్లాలోని తాండూరు 2, పరిగి 1, కొడంగల్ 1 చొప్పున మొత్తం 4 కొత్త బార్లకు లైసెన్స్‌కోసం నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కొత్త బార్లకు దరఖాస్తు చేసు కునేందుకు మొదటగా ఫిబ్రవరి 8వ తేదీ చివరగా నిర్ణయించినప్పటికీ ఈ గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించినట్టు తెలి పారు. ఇప్పటివరకు మొత్తం 138 దరఖాస్తులు రాగా తాండూరులో 2 బార్లకు గాను 56, పరిగిలో 1 బారుకు గాను 70, కొడంగల్‌లో ఒకటికి 12 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
ఇంకా ఆసక్తి ఉన్నవారు ఈనెల 16 వరకు దరఖాస్తులు చేసు కోవాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకునే వారు 3 పాస్‌పోర్టు సైజ్‌ఫొటోలు, ఆధార్‌కార్డు, పాన్ కార్డుతో పాటు లక్ష రూపాయలు చలాన్ తీసి 16వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయం వికారాబాద్ లో ఇవ్వాలని తెలిపారు. 18వ తేదీన జిల్లా కలె క్టర్ సమావేశ మందిరంలో అర్హుల ఎంపిక, కలె క్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నట్టు తెలిపా రు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ అధికారి కోటే శ్వర్రావు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఆ టైంలో అందరూ భయపెట్టారు: అమలా పాల్
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం