నాడు అధ్వానం నేడు అద్భుతం

- పల్లెప్రగతితో రూపుమారిన చౌదర్పల్లి
- రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు
- వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం
- డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణం
- ప్రతి వీధి సీసీ రోడ్డు, ఇంటింటికీ తాగునీటి నల్లా
- పవర్ వీక్ కార్యక్రమంతో కరెంట్ సమస్యలకు చెక్, నూతనంగా 20 స్తంభాల ఏర్పాటునాడు అధ్వానం
- చౌదర్పల్లిలో అభివృద్ధి పరుగులు
- రూ.35 లక్షలతో పనులు
- వందశాతం మరుగుదొడ్లు నిర్మాణం
- పన్నుల వసూళ్లలో రికార్డు
బొంరాస్పేట, ఫిబ్రవరి 8 : పల్లె ప్రగతి చౌదర్పల్లి గ్రామాభివృద్ధికి బాటలు వేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఇంటింటికీ తాగునీటి నల్లా, మరుగుదొడ్డి, వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం గ్రామాభివృద్ధికి నిదర్శనం. ఒకప్పుడు పాడుబడ్డ బావులు, పెంటకుప్పలు, మురుగు గుంతలతో దర్శనమిచ్చే గ్రామం, నేడు ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికతో కొత్తశోభను సంతరించుకున్నది. అభివృద్ధిలో మేము సైతం అంటూ ప్రజలు, మహిళలు ముందుకు వచ్చి శ్రమదానం చేసి వీధులు, రోడ్లను శుభ్రం చేసుకున్నారు. మంజూరవుతున్న నిధులతో చౌదర్పల్లి పరిశుభ్ర గ్రామంగా రూపుదిద్దుకున్నది.
రూ.9.50 లక్షలతో ట్రాక్టర్ కొనుగోలు
గ్రామాన్ని శుభ్రంగా ఉంచడానికి పంచాయతీ నిధులు రూ.9.50 లక్షలతో ట్రాక్టర్ను కొనుగోలు చేసి ప్రతిరోజూ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. తడి, పొడి చెత్తను సేకరించడానికి ప్రతి ఇంటికీ రెండు బుట్టలను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ వీధులు, మురుగు కాల్వలను శుభ్రం చేస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారుల స్థానంలో రూ.2.50 లక్షలు వ్యయం చేసి సీసీ రోడ్లను నిర్మించారు. పవర్ వీక్ కార్యక్రమంలో భాగంగా శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలను తొలగించి 20 కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు.
గ్రామాభివృద్ధికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. చౌదర్పల్లి నుంచి హంసాన్పల్లి, చౌదర్పల్లి నుంచి నాందార్పూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.30 కోట్లు మంజూరు చేయగా, వీటి పనులు కొనసాగుతున్నాయి. ఉన్నత పాఠశాల భవన మరమ్మతు పనులకు మంజూరైన రూ.5లక్షలు జడ్పీ నిధులతో పనులు పూర్తి చేశారు.
బహిరంగ మలవిసర్జన రహిత గ్రామం
స్వచ్ఛభారత్ మిషన్ పథకం ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని నిర్మించుకుని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా చౌదర్పల్లి నిలిచింది. మురుగు నీరు రోడ్లపై పారకుండా 40 ఇంకుడు గుంతలను నిర్మించారు. హరితహారంలో భాగంగా ప్రధాన రహదారి వరకు 1.5 కిలో మీటర్లు రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు. 11వేల మొక్కలను నర్సరీలో పెంచుతున్నారు.
వంద శాతం పన్ను వసూలు
ప్రజలు గ్రామాభివృద్ధికి తమవంతు తోడ్పాటును అందిస్తున్నారు. ఇంటి పన్నులు, ఇతర పన్నుల వసూళ్లలో సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. గ్రామంలో 1.13 లక్షల ఇంటి పన్నులు, రూ.8300ల ఇతర పన్నుల వసూలు లక్ష్యంకాగా, వందశాతం పన్నులను ప్రజలు చెల్లిస్తున్నారు.
రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు
2011 జనాభా లెక్కల ప్రకారం చౌదర్పల్లి గ్రామ జనాభా 1751మంది. ఓటర్ల సంఖ్య1391మంది ఉండగా 480 కుటుంబాలు ఉన్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామానికి ప్రతినెలా రూ.2 లక్షల వరకు నిధులు మంజూరవుతున్నాయి. రూ.11.40 లక్షలతో వైకుంఠధామం, రూ.4 లక్షలతో ప్రకృతివనం, రూ.25వేలతో డంపింగ్ యార్డు, రూ.2.60లక్షలతో కంపోస్టు షెడ్, రూ.36 వేలతో మూడు కమ్యూనిటీ సోక్పిట్లు నిర్మించారు. 30 రోజుల ప్రణాళికలో రూ.2.50 లక్షలు ఖర్చు చేసి మూడు గుంతలు, 4 పాడుబడ్డ బావులు, 3 పాత ఇండ్లు, 3 పెంట కుప్పలను మొరంతో పూడ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చారు.
పల్లె ప్రగతితో కొత్తరూపు
పల్లెప్రగతితో గ్రామానికి కొత్తరూపు వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రకృతివనం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్, డంపింగ్ యార్డు నిర్మించాం. తడిపొడి చెత్త సేకరణకు ప్రతి ఇంటికీ బుట్టలు పంపిణీ చేసి మహిళలకు అవగాహన కల్పించాం. పారిశుద్ధ్య కార్మికులు రోజూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నారు.
పన్నుల వసూలుకు సహకరిస్తున్నారు
గ్రామంలో వందశాతం పన్నులను ప్రజల సహకారంతో వసూలు చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాం. పారిశుద్ధ్యానికి, మొక్కల పెంపకానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇండ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను ప్రతి రోజూ ట్రాక్టర్లో సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం.
-యాదగిరి, పంచాయతీ కార్యదర్శి
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్