మహిళాభివృద్ధికి ప్రభుత్వం చేయూత

- సంఘాలకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి
కులకచర్ల, ఫిబ్రవరి8: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలోని విజయచంద్ర ఫంక్షన్ హాల్లో ఐదు తెలంగాణ గ్రామీణ బ్యాంకుల నుంచి 129 డ్వాక్రా సంఘాలకు రూ. 6.66కోట్ల రుణాల చెక్కులను, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు బాగుపడితేనే కుటుంబాలు బాగుం టా యన్నారు. మహిళా సంఘాల సభ్యులు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని ఆర్థికం గా కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందని, పాత రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని సూచించారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడం వలన బ్యాంకులు కూడా రుణాలు అందించేందుకు ముం దుకు వస్తున్నాయని అన్నారు. గ్రేడులో ఉన్న సంఘాలకు ఒక్కొక్క సంఘానికి రూ.10 లక్షల వరకు రుణాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. కార్యక్రమం లో కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పీరంపల్లి రాజు, కులకచర్ల సర్పంచ్ సౌమ్యారెడ్డి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఏజీఎం నాగశ్రీనివాసన్, డీఆర్డీఏ ఏపీడీ నర్సింహులు, టీజీబీ ఆర్ఎం లక్ష్మయ్య, మండల మహిళా సమాఖ్య ప్రతినిధులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఎంపీ కొడుకుపై కాల్పులు
- కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వ్యక్తి మృతి
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!