మంగళవారం 02 మార్చి 2021
Vikarabad - Feb 07, 2021 , 00:31:40

టీకాపై అపోహలు వద్దు

టీకాపై అపోహలు వద్దు

  • వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల్లో పోలీసు, రెవెన్యూ, వైద్య సిబ్బంది, ఆశావర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌

ధారూరు, ఫిబ్రవరి 6 : కరోనా టీకాపై అపోహలు వద్దని ధారూరు డాక్టర్‌ రాజు పేర్కొన్నారు. శనివారం ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ధారూరు పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. 

వ్యాక్సిన్‌తో కరోనా నివారణ

కొడంగల్‌, ఫిబ్రవరి 6 : స్థానిక ప్రభుత్వ సివిల్‌ దవాఖానలో వైద్య సిబ్బంది పోలీసు సిబ్బందికి వ్యాక్సిన్‌ వేశారు. ఈ సందర్భంగా సీఐ అప్పయ్య మాట్లాడుతూ టీకాపై ప్రజల్లో ఉన్న అపోహ తొలగించే నేపథ్యంలో పోలీసు సిబ్బంది టీకాలు వేసుకొంటున్నట్లు పేర్కొన్నారు. 

నిర్భయంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

మోమిన్‌పేట, ఫిబ్రవరి 6 : నిర్భయంగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని మోమిన్‌పేట సీఐ వెంకటేశం సూచించారు. మోమిన్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్‌ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది టీకాలను వేయించుకున్నారు. పోలీస్‌ సిబ్బంది 10, రెవెన్యూ సిబ్బంది 8 మందికి టీకాలు ఇచ్చినట్లు డాక్టర్‌ సుధీర్‌ బాబు తెలిపారు.

100 మందికి 16 మందికే టీకా

బొంరాస్‌పేట, ఫిబ్రవరి 6 : రెండో విడుత కరోనా టీకాను శనివారం కేవలం 16 మంది మాత్రమే వేసుకున్నారు. ఎస్‌ఐ శ్రీశైలంతోపాటు పోలీసు సిబ్బంది, ముగ్గురు వీఆర్‌ఏలు టీకా వేయించుకున్నారు.

మర్పల్లిలో 17 మందికి టీకాలు 

మర్పల్లి, ఫిబ్రవరి 6 : మండలంలోని పట్లూర్‌ పీహెచ్‌సీ, మర్పల్లి దవాఖానలో 49 మందికిగాను 17 మంది ఉద్యోగులకు టీకాలు వేసినట్లు డాక్టర్‌ ప్రశంస తెలిపారు.

VIDEOS

logo