సోమవారం 08 మార్చి 2021
Vikarabad - Feb 06, 2021 , 00:27:21

అంతుచిక్కని వ్యాధితో ఆందోళన

అంతుచిక్కని వ్యాధితో ఆందోళన

  • మృత్యువాతపడుతున్న మేకలు, కోళ్లు, కాకులు
  • మృతిచెందిన కోళ్లు, కాకుల రక్త నమూనాల సేకరణ
  • మైలారంలో పర్యటించి పరిశీలిస్తున్న వైద్యాధికారులు 

ధారూరు, ఫిబ్రవరి 5 : మండల పరిధిలోని దోర్నాల్‌ గ్రామంలో వరుసగా పెంపుడు కోళ్లు, కాకులు అంతుచిక్కని వ్యాధితో మృతిచెందుతున్నాయి. మూడు రోజులుగా పశు వైద్యాధికారులు పరిశీలిస్తున్నా వ్యాధి అంతు చిక్కడంలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం దోర్నాల్‌లో మూడు కోళ్లు మృతిచెందాయని తెలిపారు. అదేవిధంగా మైలారం గ్రామంలో 3 కోళ్లు, 2 కాకులు, ఒక మేక మృతిచెందాయి. శుక్రవారం పశువైద్యాధికారులు గ్రామంలో పర్యటించి పరిశీలించారు. మృతి చెందిన కోళ్లు, కాకుల రక్త నమూనాలను తీసుకొని ల్యాబ్‌కు పంపించారు. బలహీనంగా ఉన్న కోళ్లకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్‌ ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో దోర్నాల్‌, మైలారం సర్పంచులు సుజాత, బాబ్యానాయక్‌ ఉన్నారు.


VIDEOS

logo