గురువారం 25 ఫిబ్రవరి 2021
Vikarabad - Feb 04, 2021 , 00:35:17

రూ.500 కోట్ల రుణాలు అందిస్తాం

రూ.500 కోట్ల రుణాలు అందిస్తాం

  • రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి 

 కులకచర్ల, ఫిబ్రవరి 3 : స్వయం సహాయక సంఘాలకు జిల్లాలో రూ.500 కోట్ల వరకు రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. బుధవారం కులకచర్లలో పీఏసీఎస్‌ కార్యాలయంలో డైరెక్టర్ల ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.  కలెక్టర్‌ ఇచ్చిన సంఘాల వివరాల ప్రకారం ఒక్కో సంఘానికి రూ.10లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి మండలానికి రూ.కోటీ 70లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ శేరి రాంరెడ్డి, నాయకులు రాజప్ప, కొండయ్య, మొగులయ్య, వెంకటయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.


VIDEOS

logo