సోమవారం 01 మార్చి 2021
Vikarabad - Feb 03, 2021 , 02:31:36

దోమ కేజీబీవీ పాఠశాల సందర్శన

దోమ కేజీబీవీ పాఠశాల సందర్శన

  • ఎస్‌వో పనితీరుపై డీఈవో రేణుకాదేవి ఆగ్రహం

దోమ, ఫిబ్రవరి 2 : దోమ కేజీబీవీ పాఠశాలను సందర్శించిన డీఈవో రేణుకాదేవి పాఠశాల ఎస్‌వో మంగమ్మ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం దోమ కేజీబీవీతోపాటు బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించిన డీఈవో నిత్యావసర సరుకులు, పలు రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల చదువుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీ పాఠశాలలో గతంలో ఉన్న నిత్యావసర సరుకులు అలాగే నిలువ ఉండడం, నూతనంగా కొనుగోలు చేసిన వేరుశనగ తదితర నిత్యావసర సరుకులు నాసిరకంగా ఎందుకున్నాయని మండిపడ్డారు. కాంట్రాక్టర్‌లతో కుమ్మకై నాసిరకంతో ఉన్న సరుకులతో విద్యార్థులకు భోజనం వడ్డిస్తే ఏమైనా అనారోగ్య సమస్యలు తలెత్తినట్లయితే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌వోను హెచ్చరించారు. పక్కనే నిర్మాణం కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ భవనానికి వాడుతున్న ఇసుకను ఆమె పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి నాణ్యతా ప్రమాణాలు ఉండేలా నిర్మాణం జరిగేలా చూడాలని.. లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఆమె బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి వారి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థి కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పురందాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


VIDEOS

logo