: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు

- విజయవంతమైన పల్స్ పోలియో
- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
కొడంగల్, జనవరి 31 : నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో మేలును చేకూరుస్తాయని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బొంరాస్‌పేట మండలంలోని బొల్లోనితండాలో ఎమ్మెల్యే చిన్నారులకు పోలియో చుక్కలను చేశారు. బొంరాస్‌పేట మండల ఆరోగ్య కేంద్రంలో డీఎంఅండ్‌హెచ్‌వో సుధాకర్‌షిండే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించారు. కొడంగల్ పరిధిలో 92శాతం, 91శాతం చిన్నారులకు పోలియో చుక్కలు అందించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కొడంగల్ రెండో వార్డులో మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్‌యాదవ్, దౌల్తాబాద్‌లో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ మంజుల పోలియో చుక్కలు వేశారు.
పోలియో మైలేటిస్ వైరస్ ద్వారా సంక్రమిస్తుంది..
వికారాబాద్, జనవరి 31 : చిన్నారులకు పోలియో జబ్బు మైలేటిస్ అనే వైరస్ ద్వారా సంక్రమిస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానలో పోలియో చుక్కలు వేశారు. నియోజకవర్గంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, ఆరోగ్య ఉపకేంద్రం, అంగన్వాడీ కేంద్రాల్లో, బస్టాండ్, రైల్వేస్టేషన్, అనంతగిరి ఆలయం వద్ద పోలియో కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసి చిన్నారులకు చుక్కల మందును వేశారు. మొబైల్ టీం ద్వారా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్, సంచారజాతుల వారికి పోలియో చుక్కలు వేశారు. ధారూరు మండలంలో జడ్పీటీసీ సుజాత, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, మర్పల్లిలో ఎంపీపీ బంటు లలిత, వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ఎంపీవో సోమలింగం, డాక్టర్ ప్రశంస, వికారాబాద్ రామయ్యగుడ పీహెచ్‌సీలు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జీవరాజ్, నవాబుపేటలో జడ్పీటీసీ పోలీస్రాంరెడ్డి, మోమిన్‌పేటలో సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, కోట్‌పల్లి ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి బూత్‌లలో పోలియో డ్రాప్స్ వేశారు.
తాజావార్తలు
- హైవేపై ట్రక్కు భీభత్సం.. ఐదుగురు మృతి
- ఆ సీఎంకు రక్షణగా అందరూ మహిళలే..
- పువ్వాడ ఇంటికి అతిథిగా వెళ్ళిన చిరు, చరణ్
- మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
- అరబిందో ఫార్మాలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
- అల్లరి నరేష్ చిత్రం ఓటీటీలో విడుదల
- పార్లమెంట్లో కొవిడ్ వ్యాక్సినేషన్
- రాష్ర్టంలో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు
- సమంత స్టన్నింగ్ డ్యాన్స్ వీడియో వైరల్
- అజ్ఞాతవాసి ఎఫెక్ట్.. తాజా సినిమా కోసం కసిగా పని చేస్తున్న త్రివిక్రమ్